రాం గోపాల్ వర్మ-కె.ఏ.పాల్ కాంబినేషన్‌లో సినిమా అంటే మామూలు మాటలు కాదు. భారీ బడ్జెట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇది ప్రంపచ స్థాయిలో ప్రతీ ఒక్కరు చూడాలి కాబట్టి. అసలు వర్మ.. "పాల్" బయోపిక్ తీస్తానని ఎప్పుడో అనుకున్నాడట. అందుకే పాల్ తో పర్సనల్ గా కూడా కలిశాడని ఈ మధ్య పాల్ తనంతట తానే అందరికీ చెప్పాడు. "నందమూరి తారక రామారవు" గారి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా  లక్ష్మీస్ NTR"తీసినప్పటి నుంచి బయోపిక్స్ అందరికంటే వర్మే బాగా తీస్తాడని చర్చించుకుంటున్నారట. 

ఒకరకంగా అది వాస్తవం కూడా. ఎందుకంటే ఎవరికి భయపడని వర్మ తను ఏదనుకుంటే అది తీస్తాడు. పక్కా ఇన్‌ఫర్మేషన్ కావాలనుకుంటే ఎవరిని కలవడానికైనా, ఎంత దూరమైనా వెళ్తాడు. ఎటువంటి రిస్కైనా చేస్తాడు. అందుకే పాల్ కూడా.. మీ జీవిత చరిత్ర తీస్తానంటే "నేనేమైనా దేవుడినా..నా బయోపిక్ ఎందుకు"? అంటూనే అతి ఉత్సాహం చూపించారు. మరి ఎక్కడ పొంతన కుదరలేదోగాని ఒకరిమీద ఒకరు సెటైర్లు, కామెంట్లు చేసుకుంటు ఈ బయోపిక్ గురించి మర్చేపోయారు. అయితే వర్మ ఎప్పటిలాగే ట్విట్టర్ లో ట్వీట్లు విసురుతూనే తన పాటికి తను వరుసబెట్టి బయోపిక్ ల వెంట పడి బిజి బిజిగా ఉన్నాడు. "లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్" తీసిన వర్మ "శశికళ" అనే మరో బయోపిక్ కి రంగం సిద్దం చేసుకున్నాడు. ఇంతలోనే మళ్ళీ తెలంగాణా ముఖ్య మంత్రి కె.సి.ఆర్ బయోపిక్ అంటూ ఆంధ్రా వాళ్ళను తిడుతూ పాట కూడా పాడేశాడు. 


ఇదంతా తెలిసిన కె.ఏ.పాల్...అసలు బయోపిక్ తీస్తానని ముందు నా దగ్గరకే కదా వచ్చారు...ఇంతలోనే నన్ను పక్కన పెట్టేసి అందరి బయోపిక్ లు తీసుకుంటే ఎలా..నేనేమై పోవాలి..బడ్జెట్ ఎంతో చెప్పండి, బాహుబలి రేంజ్ లో ఖర్చు పెడదాం. కలెక్షన్స్ "అవేంజర్స్" ని మించి వస్తాయ్..దానికి నేను గ్యారెంటీ..ప్రపంచ వ్యాప్తంగా నా కెపాసిటీ ఎవరీకీ తెలీడం లేదు...ఒక్క రోజులో పెట్టిన డబ్బులొచ్చేస్తాయ్..అని అనుకుంటున్నాడట. మరి పాల్ ఆఫర్ ని వర్మ ఒప్పుకుంటారో.. లేదా బడ్జెట్ సరిపోదంటారో చూడాలి. ఏదేమైనా "పాల్ బయోపిక్" అంటే బాక్సులు బద్దలవ్వాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: