ఎన్నో మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న యువ కథానాయకి అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో  నటించిన చిత్రమే "లీసా' త్రీడి.  వీరేష్ కాసాని  సమర్పిస్తున్న   ఈ  చిత్రాన్ని  ఎస్.కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు.   ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ తమ అనుభవాలు పంచుకున్నారు. ముందుగా చిత్ర సమర్పకులు కాసాని వీరేశ్ మాట్లాడుతూ  '' అంజలి ఇంతకు ముందు ఎన్నో మంచి చిత్రాలు చేయడం జరిగిందని మరో మంచి సినిమాగా ఈ సినిమా వస్తుంది. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా ఈ సినిమా ఉంటుంది'' అన్నారు .

చిత్ర నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ''గతంలో అంజలితో షాపింగ్ మాల్ జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు  ఎస్.కె. పిక్చర్స్  ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది  ఆ సినిమాలను ఎంతో అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అలాగే ఈ లీసా త్రీడి సినిమాని కూడా ఆదరిస్తారు. తెలుగులో పూర్తిగా షూటింగ్ జరిగిన ఈ సినిమాని డిజిటల్ రూపంలో  త్రీడీలో  విడుదలవుతున్న మొట్టమొదటి హారర్ చిత్రమిది.  త్రీడీ రూపంలో చూడబోయే ఈ సినిమాని సమ్మర్ కానుకగా పిల్లలు దగ్గరనుండి  పెద్ద వాళ్ళందరికీ పూర్తి వినోదాత్మకంగా అందించడం కోసం ఈ వేసవి కానుకగా మే 24న  ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు. 


"లీసా' త్రీడీ  చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ...
 100 రోజులు పైగా ఈ షూటింగ్ జరిగింది. షూటింగ్ సెట్ లో ఎన్నో మంచి అనుభూతులు పొందాను.  ఒక సినిమా షూటింగ్ చెయ్యడం అంటే కష్టమైన పని అని చెప్పాల్సిన అవసరం లేదు. అది 3D లో అయితే ఇంకా కష్టమైన పని . కానీ పి.జి.ముత్తయ్య గారి ఫ్రేమ్స్ మరియు ఆయన కష్టం వల్ల శరవేగంగా పూర్తయ్యింది.  ముత్తయ్య గారి టైం, కష్టం మా కోసం  వెచ్చించినందుకు ఆయనకు నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. అంజలి గారు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  టైటిల్ రోల్ లో ఆమె  ఆ పాత్ర కి న్యాయం చేసిందనే చెప్పాలి.

నటుడు సామ్ జోన్స్ ఇందులో మంచి పాత్ర చేసాడు. చాలా మంచి నటుడు. ఇక మకరంద్ దేశ్ పండే  గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వావ్. ఇతని ఆక్టింగ్ స్కిల్ల్స్ చూసి సెట్ లో అందరు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం గారు నటించారు. ఆయనకు   పద్మశ్రీ,  గిన్నీస్ రికార్డు వంటి ఎన్నో అవార్డులు ఉన్నా ఎప్పుడూ సింపుల్ గా నవ్విస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని  డైరెక్ట్ చెయ్యడం నా అదృష్టంగా బావిస్తున్నాను. నటి  సలీమా గారు రెండు దశాబ్దాల క్రితం తెలుగు, కన్నడ లో హీరోయిన్  గా చేసింది. నేను తనను అప్రోచ్ అయ్యి ఈ చిత్రంలో నటించమని  అడగగానే వెంటనే ఒప్పుకుంది అందుకు ఆవిడకు నా థ్యాంక్స్. ఇక మైమ్ గోపికు ఐ లవ్ యు. ఇంతకంటే ఎక్కువ ఆయన గురుంచి చెప్పలేను.


సబితా రాయ్, సురేఖ వాణి,  చాలా  మంచి యాక్టర్స్.  చాలాబాగా సపోర్ట్ చేశారు. ఇందులో కళ్యాణి నటరాజన్  అంజలి కి తల్లి పాత్రలో చేసింది. తన న్యాచురల్ యాక్టింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. జబర్దస్త్ ఫణి, అవినాష్. జి ఎం ఆర్ కామెడీ పాత్రల్లో నటించారు. వారందరికీ  చాలా థ్యాంక్స్ అన్నారు.  ఇందులో అంజలి గారి నటన అద్భుతం అని చెప్పాలి. కెమెరా వర్క్ చాలా బాగొచ్చింది. స్క్రిప్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ రాజు  అందరికీ నచ్చేలా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరికీ  మా లీసా చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను.  అతి త్వరలో ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి సినిమాను కూడా ఈ నెల 24న  విడుదల చేస్తామని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ దయానిధి మాట్లాడుతూ... ఈ చిత్రానికి సంగీతం  అందించే అవకాశం కలిపించినందుకు దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. అద్భుతమైన  ఆర్ ఆర్ తో పాటు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి అని ఖచ్చితంగా చెప్పగలను అన్నారు. 
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ... మొదటి సారిగా 3డి చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజు కు స్క్రిప్ట్ పై మంచి క్లారిటీ ఉంది.. ఏదైతే చెప్పాడో అదే తీసాడు. ఇలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు.  ముత్తయ్య తన కెమెరాతో మరింత అందంగా నన్ను చూపించడమే కాకుండా ఖర్చుకు ఎక్కడా వెనకాడ కుండా తీశారు. సంతోష్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తాయి" అన్నారు.


అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,  మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి' ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,
స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్, కోరియోగ్రఫీ: సురేష్, ఆర్ట్ డైరెక్టర్:  వినోద్, ఈ చిత్రానికి నిర్వహణ : , శ్రీనివాస్ గొండేల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రహాస్ ఇప్పలపల్లి, సమర్పణ కాసాని వీరేశ్ , నిర్మాత సురేష్ కొండేటి, కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: