విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో భారీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం అందుకున్న సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజయ్ నటనకు యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. ఇక ఆ సినిమా తర్వాత విజయ్ రౌడీ హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హింది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. 


తమిళంలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా ఈ సినిమా ఆదిత్య వర్మ టైటిల్ తో వస్తుంది. ఇక అర్జున్ రెడ్డి హింది వర్షన్ ను షాహిద్ కపూర్ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సేం టూ సేం అర్జున్ రెడ్డి కపీ వర్షన్ అనిపించింది. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ కు అది బాగా ఎక్కేసింది. సందీప్ వంగ మరోసారి కబీర్ సింగ్ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.


షాహిద్ కపూర్, కియరా అద్వాని లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. జూన్ 21న కబీర్ సింగ్ రిలీజ్ ప్రకటించారు. అయితే నిమిషం టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన కబీర్ సింగ్ ట్రైలర్ తో ఎలా ఆకట్టుకుంటారన్నది చూడాలి. సందీప్ వంగ ఈ సినిమాతో బాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.


కబీర్ సింగ్ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించడం కూడా ఓ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. లస్ట్ స్టోరీస్ తో తన హాట్నెస్ తో అందరిని సర్ ప్రైజ్ చేసిన కియరా కబీర్ సింగ్ లో కూడా ముద్దులతో ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తుంది. తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా హిందిలో కూడా అలాంటి క్రేజీ హిట్ కొట్టేలా కనబడుతుంది. కొన్నాళ్లుగా బాక్సాఫీస్ రేసులో వెనుకపడి ఉన్న షాహిద్ కపూర్ కబీర్ సింగ్ గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: