టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వస్తున్న 'డియర్ కామ్రేడ్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ మూవీని జూలై 26న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ మూవీకి డైరెక్టర్ భరత్ కమ్మ.

 విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మూవీ రిలీజ్ డేట్ పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ అభిమానులను కన్ఫ్యూజన్ కి గురిచేస్తోన్న సంగతి తెలిసిందే.  రొమాంటిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది.  విజయ్ దేవరకొండ రేంజ్ మరింత పెంచేలా ఈ మూవీ ఉంటుందని నిర్మాతలు చెపుతున్నారు. రేపు విజయ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కింది. తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: