రాఘవ లారెన్స్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాలో ఓ పాటలో ఎక్కడో నాలుగో వరుసలో డాన్స్ చేస్తూ కనిపించాడు. అయితే అంతమంది ఉన్నప్పటికి మెగాస్టార్ కి ఎందుకనో లారెన్సే ఫ్యూచర్ లో గొప్ప డాన్సర్ అవుతాడని అనిపించింది. అందుకే హిట్లర్ సినిమాలో ఒక పాటకు కొరియోగ్రఫీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంతే ఇక లారెన్స్ డాన్స్ మాస్టర్ గా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరికి డాన్స్ కొరియోగ్రఫీ ని అందించాడు. ముఖ్యంగా తనకు కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చిన మెగాస్టార్ అన్నయ్యకు ఐతే కొత్త డాన్స్ మూమెంట్స్ ని క్రియోట్ చేసీ అద్ధిరిపోయో డాన్స్ ని చేయించాడు. 


మెగాస్టార్ సినిమాలో ఖచ్చితంగా ఒక సోలో సాంగ్ లారెన్స్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా చిరంజీవి 150వ సినిమాలో రత్తాలు రత్తాలు సాంగ్ తో అదరగొట్టాడు. అంతేకాదు దర్శకుడిగాను తన సత్తాను చాటుకుంటున్నాడు. ముఖ్యంగా ముని సిరీస్ తో ప్రేక్షకులను తెగ నవ్విస్తూ భయపెడుతున్నాడు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలే సీక్వెల్స్ తీస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ లారెన్స్ మాత్రం ఈ సీక్వెల్స్ తో మంచి కమర్షియల్ సక్సస్ లను అందుకుంటున్నాడు. 


జెర్సీ, కాంచన-3 ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే జెర్సీ లో ఉన్న ఎమోషన్స్,కంటెంట్ కాంచన-3 లో లేనప్పటికి 100 కోట్లు కలెక్ట్ చేసి లారెన్స్ కి తిరుగు లేదనిపించింది. ఈ దెబ్బతో లారెన్స్ ఇదే సిరీస్ లో ఏకంగా 10 చిత్రాలను తెరకెక్కిస్తానని అన్నాడు. ఇదీ మరీ మూఢ నమ్మకంగా అనిపించినప్పటికి లారెన్స్ తన మాట నిలబెట్టుకుంటాడేమో అనిపిస్తుంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్‌లో కాంచన చిత్రాన్ని "లక్ష్మీ బాంబ్"  గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో తెరకెక్కించడమే కాకుండా "కాంచన-4" కి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: