‘మహర్షి’ తన కెరియర్ లో 25వ సినిమా అయిన నేపథ్యంలో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాడు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడిపోతున్నాడు మహేష్ బాబు. మరో పక్క మహేష్ బాబు కంటే ఈ సినిమా రిజల్ట్ పై అల్లరి నరేష్ ఎక్కువ సతమతమవుతున్నట్లు పిచ్చ టెన్షన్ మీద ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.

Image result for allari naresh

గత కొంత కాలం నుండి చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన నేపథ్యంలో చేతిలో కూడా ఎక్కువ సినిమాలు లేని టైం లో  వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ కి ఎంప్రెస్ అయినా అల్లరి నరేష్..సినిమాలో మహేష్ బాబు కి ఫ్రెండ్ గా నటించి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Image result for allari naresh

ఇండస్ట్రీలో ఒక కమెడియన్ హీరోగా ఉన్న అల్లరి నరేష్ ఒక స్టార్ హీరో పక్కన క్యారెక్టర్ రోల్స్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదని ఏ మాత్రం సినిమా అడ్డం తిరిగిన అల్లరి నరేష్ కెరీర్ డేంజర్ జోన్ లో పడినట్లే అని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కంటే ఈ సినిమా రిజల్ట్ కోసం అల్లరి నరేష్ తెగ టెన్షన్ పడుతున్నట్లు ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: