సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేష లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఫలితంపై మహేష్ కాకుండా మరో హీరో గట్టి కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. అతనెవరో తెలుసా ఇంకెవరు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆల్రెడీ మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి యూనిట్ అందరికి తన విషెస్ అందించిన విజయ్ దేవరకొండ సినిమా సక్సెస్ అవ్వాలని అంటున్నాడు.


మహేష్ మహర్షిపై విజయ్ ఎందుకు అంత స్పెషల్ ఫోకస్ పెట్టాడు అంటే మహర్షి రిలీజ్ ఈరోజు అనగా మే 9 విజయ్ దేవరకొండ బర్త్ డే. తన పుట్టినరోజు నాడు రిలీజ్ అవుతున్న మహేష్ మహర్షి సూపర్ హిట్ అయితేనే మంచిదని.. లేదంటే తనకు చెడ్డ పేరు వస్తుందని తన సన్నిహితులతో ప్రస్థావించాడట విజయ్ దేవరకొండ. అయితే మహర్షి హిట్ పై చిత్రయూనిట్ అంతా ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.


మహేష్ తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా మహర్షి ఉంటుందని గర్వంగా చెబుతున్నాడు. దిల్ రాజు. అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాలో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 


మరి విజయ్ దేవరకొండ కోరుకున్నట్టే మహర్షి సూపర్ హిట్ కొడుతుందా లేదా మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ నుండి వస్తున్న రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. సినిమా క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందట. 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో మహేష్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని తెలుస్తుంది. సినిమాలో అన్నిటికన్నా కథ చాలా బాగా రాసుకున్నాడట వంశీ పైడిపల్లి.



మరింత సమాచారం తెలుసుకోండి: