టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కిన మ‌హ‌ర్షి సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా తెర ముందుకు వ‌చ్చింది. టాలివుడ్‌లో ముగ్గురు అగ్ర నిర్మాత‌లు అయిన చెల‌సాని అశ్వినిద‌త్‌, పివిపి, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపెల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే ఓవ‌ర్‌సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకున్న మ‌హ‌ర్షి ఎలా ఉందో ఫ‌స్ట్ షో టాక్‌లో చూద్దాం.  


ఈ సినిమా కథ‌ విషయానికి వస్తే రిషి క్యారెక్టర్‌లో హీరో మహేష్ బాబు కాలేజ్ రోజుల నుంచి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని అనుకుంటాడు. అదే సమయంలో రిషికి నటించిన హీరోయిన్ పూజా హెగ్డే అల్లరినరేష్ మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక సినిమాలో కథానుసారం తిరుగులేని వ్యాపారవేత్తగా మహేష్ ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా ఉంటాడు. అలాంటి రిషి చివరకు ఒక సాధారణ రైతుగా ఎందుకు మారాల్సి వచ్చింది? రిషి ఎమోషనల్ జర్నీలో రవి(అల్ల‌రి న‌రేష్‌) పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఈ ఎమోషనల్ జర్నీలో ఎంతవరకు కనెక్ట్ అయ్యాడు? హీరోయిన్ పూజ పాత్ర ఏంటి అన్నది వెండి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే కామెడీ సీన్‌లు, మ‌హేష్ డైలాగులు, ఫైట్‌లు, ఇంట‌ర్‌వ్యూలు సైతం హైలెట్ అయ్యాయి.  ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు మేజర్ హైలైట్. సెకండాఫ్‌లో మాస్ ఎలిమెంట్స్, ఎమోష‌న‌ల్ సీన్‌లు, క్లైమాక్స్ బాగున్నాయి.


 మహేష్ వ్యాపారవేత్తగా, కాలేజీ స్టూడెంట్‌గా రెండు పాత్రల్లో చక్కగా నటించాడు. చక్కటి స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఇక రైతుగా మూడో షేడ్‌లో సైతం చ‌క్క‌గా న‌టించాడు. అల్లరి నరేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా హీరోయిన్ పూజా హెగ్డే మంచి నటన కనబరిచింది. జగపతిబాబు మరోసారి పవర్‌ఫుల్ విల‌న్‌గా త‌న విల‌నిజం చూపించాడు. సినిమాలో మహేష్ బాబే యాక్టింగ్‌, కాలేజ్ ఎపిసోడ్స్‌, ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్‌, సెకండ్ఆఫ్ మాస్ ఎలిమెంట్స్ ప్ల‌స్‌లు. మైన‌స్‌లు విష‌యానికి వ‌స్తే రాంగ్ టైమ్ బాగా ఎక్కువ కావ‌డం, నిరాశ ప‌రిచిన బ్యాగ్‌రైండ్ మ్యూజిక్ సినిమాలో చాలా చోట్ల డ‌ల్ అయిన న‌రేష‌న్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఫస్ట్ షో టాక్ తర్వాత మహర్షికి పాసిటీవ్ స్పందన వస్తోంది. మ‌రి కొద్ది సేప‌టిలో మ‌హ‌ర్షి పూర్తి టాక్ ఏమిటో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: