ఈరోజు తెల్లవారుజాము నుండి ‘మహర్షి’ ధియేటర్స్ వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈమూవీకి సంబంధించి స్పెషల్ షోలు అప్పుడే మొదలైపోయాయి. అందుతున్న ప్రాధమీక సమాచారం బట్టి ఈమూవీ ఫస్ట్ ఆఫ్ టాక్ చాల పాజిటివ్ గా వస్తోంది.

దీనితో మహేష్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో అభిమానుల ఉత్సాహానికి ఊహించని కట్టడి ‘మహర్షి’ టీమ్ చేస్తూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. సాధారణంగా టాప్ హీరోల అభిమానులు వారి అభిమాన హీరోల స్పెషల్ షోలకు వెళ్లి ఆసినిమాలలో తమకు నచ్చిన కొన్ని ఫైట్ సీన్స్ ను కానీ లేదంటే డాన్స్ సీన్స్ క్లిపింగ్స్ తమ సెల్ ఫాన్స్ లో రికార్డు చేసి ఆ సినిమా ధియేటర్ల నుండే తమ ఫేస్ బుక్ ట్విటర్ ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్లలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.

అయితే ఇటువంటి సందడికి ఈసారి ‘మహర్షి’ టీమ్ ముందునుంచే నియంత్రణ పెడుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు నిన్న అర్ధరాత్రి 12 గంటల నుండి సోషల్ మీడియాలో లీక్ అయ్యే ఇలాంటి క్లిపింగ్స్ ను కట్టడి చేయడానికి ఒక స్పెషల్ యాంటీ పైరసీ టీమ్ ను ‘మహర్షి’ టీమ్ సిద్ధం చేసినట్లు టాక్. 

ఈసినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ అయ్యే క్లిపింగ్స్ ను ఎప్పటికప్పుడు తొలగించడానికి ఈ ‘మహర్షి’ యాంటీ పైరసీ టీమ్ ఇప్పటికే ఫేస్ బుక్ ట్విటర్ ఇన్ స్టా గ్రామ్ సంస్థల నిర్వాహకులతో ఒక అంగీకారానికి వచ్చినట్లు టాక్. అంతేకాదు ఇలా ధియేటర్ల నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే క్లిపింగ్ లను షేర్ చేసిన వారికి చట్ట ప్రకారం చర్యలు కూడ తీసుకుంటామని ‘మహర్షి’ టీమ్ హెచ్చరికలు చేస్తోంది. దీనితో ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ అయినా తమ ఆనందాన్ని కంట్రోల్ చేస్తున్న ‘మహర్షి’ టీమ్ పై మహేష్ అభిమానులు బయటకు చెప్పుకోలేని అసహనంతో ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: