టాలీవుడ్ కు ఓ హీరో వచ్చాడు.. అతను వచ్చింది చిన్న సినిమాతోనే అయినా పెద్ద సంచలనాలే సృష్టిస్తున్నాడు. సినిమా సినిమాకు సత్తా చాటుతూ వస్తున్న ఆ హీరో ఇప్పుడు తెలుగులో రౌడీ హీరోగా యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అతనెవరో ఈపాటికి మీ అందరికి అర్ధమై ఉండొచ్చు. అతనే మన విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. 


విజయ్ నటించిన తొలి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆ సినిమాలో ఓ చిన్న రోల్ లో కనిపించాడు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశాడు. ఇక సోలో హీరోగా చేసిన పెళ్లిచూపులు గ్రాండ్ సక్సెస్ అవడం ఆ తర్వాత అర్జున్ రెడ్డితో యూత్ ఐకాన్ గా మారడంతో విజయ్ దేవరకొండ టాప్ లీగ్ లోకి వెళ్లాడు. సినిమా అంటే తనకెంత ప్యాషన్ అన్నది అప్పుడప్పుడు తన ఇంటర్వ్యూస్ లో చెబుతూ ఉంటాడు విజయ్.


అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం కూడా అతని క్రేజ్ మరింత పెంచేసింది. ఇక విజయ్ సినిమాల్లో లిప్ లాక్ కంపల్సరీ అయ్యింది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి దగ్గర నుండి ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. రాబోతున్న డియర్ కామ్రేడ్, క్రాంతి మాధవ్ సినిమాల్లో కూడా విజయ్ తన లిప్ లాక్ రచ్చ కొనసాగిస్తూనే ఉన్నాడు. విజయ్ తో లిప్ లాక్స్ కు హీరోయిన్స్ కూడా సరే అని చెబుతుండటం విశేషం.


ఇలా తనతో నటించిన ప్రతి హీరోయిన్ అదర చుంబనాలతో హీరోయిన్స్ కు నిద్రపట్టకుండా చేస్తున్నాడు విజయ్. ఇన్నాళ్లు టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ హీరో అంటే నాగార్జున అని ఉండేది.. ఇప్పుడు ఆ ట్యాగ్ లైన్ నాగ్ కు తీసేసి విజయ్ దేవరకొండకు పెట్టాలని చూస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ తన సొంత టాలెంట్ తో సత్తా చాటుతున్నాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తను ఇలానే సక్సెస్ ఫుల్ కెరియర్ లో మరెన్నో బర్త్ డేలు జరుపుకోవాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: