"సమంత"..టమిళ టాప్ డైరెక్టర్ గౌతం మీనన్ ఫేవరేట్ హీరోయిన్.. కాదు కాదు ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్.. కాదు కాదు అక్కినేని కోడలు, నాగ చైతన్య "బెటర్ హార్ట్"...ఇదీ కరెక్ట్. కానీ ఈ క్రేజ్, ఈ పాపులారిటీ, అక్కినేని హోదా.. అంతా కూడా తన వల్లే. తను లేక పోతే "సమంత" లేదు అంటోంది "సమంత". ఇంతకీ ఎవరామే...? గౌతం మీనన్ సినిమాలో హీరోయిన్ గా ఎంతోమందిని వెతికాడు. చాలామందికి మేకప్ టెస్ట్ చేశాడు. 


కానీ గౌతం ని ఎవరు "మాయ" చేయలేకపోయారు. ఇక తన మనసకు నచ్చిన హీరోయిన్ దొరకదని ఫిక్సైన టైం లో "సమంత" కనిపించింది. అంతే గౌతం ని "ఏం మాయ చేసిందో" గాని అదే తన సినిమా టైటిల్ అయిపోయింది. గౌతం నే కాదు ఈ సినిమాలో నాగ చైతన్యని, ఇదే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసేసింది. "ఈ లోకంలో ఇంతమంది ఉండగా జెస్సీ నే అందరికి ఎందుకు నచ్చింది"..? ఎందుకంటే.. తనలో అందం ఉంది, మొహంలో అమాయకత్వం ఉంది. ఆ వాయిస్ లో తెలీని మత్తుంది. 


అందుకే నాగ చైతన్యతో పాటు ప్రేక్షకులు "హ్యాంగోవర్" లో ఉండిపోయారు. అయితే అందరు ఇలా హ్యాంగోవర్‌లో ఉండటానికి కారణం తను మాత్రం కాదు అంటోంది సమంత. యస్...ఇదంతా నాకు మొదటి సినిమా నుండి డబ్బింగ్ చెబుతున్న "చిన్మయి" వల్లే వచ్చిన పాపులారిటీ, ఫేం అని నిర్మొహమాటంగా ఒప్పుకుంది. నిజమే స్క్రీన్ మీద సమంత మాయ చేస్తుందంటే ఆ క్రెడిట్ చిన్మయికీ దక్కాల్సిందే. ఏదేమైనా ఇలా నిజం ఒప్పుకోవడం కూడా ఒక్క సమంతకే సాధ్యమైంది.       


మరింత సమాచారం తెలుసుకోండి: