అపుడెపుడో అమ్మాయి మాస్.. అబ్బాయి క్లాస్ మూవీతో తెలుగులో అరంగేట్రం చేసిన హరిప్రియ కన్నడ అందం. ఆమెకు గ్లామర్ బాగా ఉంది. టాలెంట్ కూడా ఉంది. అయినా టాప్ పొజిషన్ మాట దేముడెరుగు కనీసం చాన్సులు కూడా రాలేదు. ఇక ఆమె ఒకటి రెండు మూవీస్ చేసి పక్కకు వెళ్ళిపోయింది. కన్నడంలో ఆమె ఇపుడు  మూవీస్ చేస్తోందట. కానీ బిగ్ ఇండస్ట్రీ తెలుగులో సెటిల్ అవాలన్న కోరిక అలాగే ఉండిపోయింది.


గత ఏడాది బాలయ్య, కే ఎస్ రవికుమార్ మూవీ జై సిమ్హలో సెకండ్ హీరోయిన్ గా హరిప్రియకు చాన్స్ వచ్చింది. మూవీ కూడా పరవాలేదనిపించుకుంది. ఇపుడు అదే కాంబో మరో మారు రిపీట్ అవుతోంది. హరిప్రియ మళ్ళీ బాలయ్యతో జత కట్టేస్తోంది. ఈ మూవీలో మాస్ మసాలా క్యారక్టర్ అంటున్నారు. పూర్తిగా గ్రామీణ నేపధ్యంలో ఉండే ఈ మూవీలో హరిప్రియ గ్లామర్ షోకి చాన్స్ బాగా ఉంటుందట.


మరి ఈ మూవీ తరువాత హరిప్రియకు టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువలా వస్తాయా అన్న చర్చ సాగుతోంది ఈ అమ్మడు సీనియర్ హీరో బాలయ్యతో నటించడానికి ఇదే కారణమట. తెలుగులో ఏలాలని ఆమెకు కొరిక ఉంది. అందుకోసం రెండోసారి జై బాలయ్య అంటోంది. మరి ఈ మూవీ హిట్ అవడం, హరిప్రియ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకుంటే ఆమెకు అవకాశాలు వస్తాయేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: