ఒక గోల్డ్ షాపులో పనిచేసే వర్కర్ ఒక సెలెబ్రెటీ స్థాయికి ఎదుగుతాడని ఎవరు ఊహించారు. అయితే సంపూర్ణేష్ బాబు విషయంలో ఇది వాస్తవంగా జరిగింది. ‘హృదయ కాలేయం’ మూవీతో అతడు సృష్టించిన మ్యానియాతో బర్నింగ్ స్టార్ గా మారిపోయాడు. 

సంపూ నటిస్తున్న మూవీ ‘కొబ్బరి మట్ట’ నిర్మాణం ఎప్పుడో పూర్తి అయిపోయింది. అయితే అతడి సినిమాలకు ఈమధ్య క్రేజ్ బాగా తగ్గిపోవడంతో ఈమూవీకి విడుదల సమస్యలు ఏర్పడ్డాయి. కానీ ఈ సమస్యలను కూడ లెక్క చేయకుండా ఈ బర్నింగ్ స్టార్ నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఈసినిమాలోని తన డిఫరెంట్ లుక్స్ కు సంబంధించిన ఒక స్పెషల్ పిక్ రెడీ చేసి ‘బర్త్ డే కామన్ పిక్’ అంటూ అభిమానులకు షేర్ చేసాడు.

సాధారణంగా టాప్ హీరోల అభిమానులు ఇలా తమ హీరో పుట్టినరోజునాడు స్పెషల్ పిక్చర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటారు.  కానీ ఇలాంటి పనులు కేవలం పెద్ద హీరోలు మాత్రమే కాదు తాను కూడ చేయగలను అంటూ సంపూ తన పుట్టినరోజునాడు ఒక పెద్ద అభిమాని దీన్ని తయారు చేయించినట్లు చెపుతూ ఒక పిక్ వదిలాడు. 

అయితే ఆ అభిమాని మరెవ్వరో కాదు తానే అని కూడా చెప్పుకున్నాడు. అయితే సంపూ తనకు తానుగా క్రియేట్ చేసుకున్న ఈ పిక్ చూసి కొందరు కామెడీగా సెటైర్లు వేస్తుంటే మరికొందరు ఈ పిక్ సంపూ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. కనీసం ఈ సంవత్సరం అయినా ఇతడి ‘కొబ్బరిమట్ట’ రిలీజ్ సక్సస్ అయితే సంపూ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే ఆస్కారం ఉంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: