తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ...ఇలా ఏ భాషలో నైనా యంగ్ హీరోస్ దాగ్గర్నుండి స్టార్ హీరోస్ వరకు పోటీ ఉండటం కామన్. ఇక ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా ఇద్దరు హీరోల సినిమాలు ఒకే సారి రిలీజవుతున్నాయంటే ఆ హీరోస్ బానే ఉంటారు కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం కటౌట్స్ కట్టే దగ్గర్నుంచి ఆ సినిమా హిట్ టాక్ వచ్చే వరకు కొట్టుకుంటూనే ఉంటారు. 


ఇక అసలు విషయానికొస్తే తమిళ ఇండస్ట్రీలో అటు విజయ్ కి ఇటు ధనుష్ కి మంచి క్రేజ్ ఉంది. వీళ్ళ సినిమాలు తెలుగులో కూడా రిలీజవుతున్నాయంటే ప్రేక్షకులు మరీ ఎగబడి థియోటర్స్ కి వెళ్ళరు గానీ హిట్ టాక్ వస్తే మాత్రం తప్పకుండా చూడటానికి వెనకాడరు. అయితే విజయ్ కి ధనుష్ కి ఒక విషయం లో విపరీతమైన పోటీ ఉంటుందని తమిళ ఇండస్ట్రీ టాక్. ఆ పోటీ ఎందులో తెలుసా...? హీరోయిన్ విషయంలో. ఆశ్చర్యాంగా ఉంది కదా...అవును విజయ్ సరసన నటించిన ఏ హీరోయిన్ అయినా ఆ వెంటనే ధనుష్ పక్కన నటించాల్సిందేనట. ఈ విషయంలో ధనుష్ చాలా మొండిగా ఉంటాడని కూడా ఇండస్ట్రీ టాక్.   


ధనుష్ స్టోరీ ఫైనల్ చేసేటప్పుడే.. అప్పటికి రీసెంట్‌గా విజయ్ కి జోడీగా నటించిన హీరోయిన్ ఎవరు..? అని ఆరా తీసి మరీ అదే హీరోయిన్ కావాలని దర్శక, నిర్మాతలకు ఆర్డర్ వేస్తాడట. ఒక వేళ ఆ హీరోయిన్ డేట్స్ ఖాళీ లేకపోయినా కూడా కొన్ని రోజులు ఆగి మరీ అదే హీరోయిన్ తో సినిమా చేస్తాడట. మరి విజయ్ హీరోయిన్ అంటే ధనుష్ కి సెంటిమెంటా..లేక విజయ్ పక్కన నటించిన ప్రతీ హీరోయిన్ తనతోను నటించాలనే పట్టుదలో తెలీదుగానీ గత కొంత కాలంగా ఇదే రిపీటవుతుందట. కాస్త డీప్ గా ఆలోచిస్తే ఇందులోను వాస్తవముందనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: