Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 8:11 am IST

Menu &Sections

Search

ఆ డైరెక్టర్ పై నయన్ సంచలన వ్యాఖ్యలు!

ఆ డైరెక్టర్ పై నయన్ సంచలన వ్యాఖ్యలు!
ఆ డైరెక్టర్ పై నయన్ సంచలన వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయయతార ప్రస్తుతం తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తుంది.  ఈ సినిమా తో పాటు తమిళ్ లో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న ‘దర్భార్’సినిమాలో నటిస్తుంది. 

'

 గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘చంద్రముఖి’సినిమా వచ్చిన విషయం తెలిసిందే.  ఇదే నయనతార తొలి సినిమా..ఆ తర్వాత ‘గజిని’సినిమాతో కుర్రాళ్ల మనసు దోచింది.  కొంత మంది హీరో, హీరోయిన్ల కెరీర్ లో ఈ సినిమా చేయడం వల్ల నా ఇమేజ్ దెబ్బతిన్నదని బాధపడ్డరోజులు..ఇంత మంచి హిట్ సినిమా మిస్ అయ్యామని బాధపడ్డ రోజూలూ ఉన్నాయి. 


తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఓ సినిమా విషయంలో అలానే ఫీల్ అవుతోంది. తన కెరీర్ లో 'గజిని' సినిమా చేయడం ఒక చెత్త నిర్ణయమని చెప్పింది. చంద్రముఖి తర్వాత మురుగదాస్, సూర్య కాంబినేషన్ లోవచ్చిన ‘గజిని’సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఆసిన్.. నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.  తను పోషించిన పాత్రపై నయన్ కొన్ని కామెంట్లు చేసింది. తనకు నెరేషన్ ఇచ్చిన పాత్రకు స్క్రీన్ పై కనిపించిన పాత్రకు చాలా తేడా ఉందని ఆరోపించింది.  


నా పాత్ర విషయంలో మురుగదాస్ చెప్పింది ఒకటి..చేసింది ఒకటని ఓ ఇంటర్వ్యూ లో చెప్పి బాధ పడినట్లు సమాచారం.   ఈ సినిమా అనుభవం తరువాత పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడ్డట్లు చెప్పుకొచ్చింది. అయితే రజినీతో నటించిన చంద్రముఖి లో తన పాత్ర చిన్నదైనా మంచి పేరు వచ్చిందని..శివకాశి లో ఒక్క పాటలో నటించినందుకే ఎంతో పేరు వచ్చిందని మంచి గుర్తింపు తెచ్చాయని తెలిపింది నయనతార. 


nayanatara
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author