తెలుగు ఇండ‌స్ర్టీలో సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌చూస్తే మ‌న‌కు మొట్ట మొద‌ట క‌నిపించే వ్య‌క్తులు ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌టి ఎన్టీఆర్‌, మ‌రొక‌రు ఏఎన్నార్‌.వీరిద్ద‌రు సినీ చ‌రిత్ర‌లు మ‌హాన‌టులుగా నిలిచిపోయారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ధృవతార అక్కినేని నాగశ్వరరావు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమాకు చుక్కాని లాంటి వారు.. ఏఎన్నార్ కు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఆయన సెంటిమెంట్ ప్రకారమే ఏదైనా చేస్తాడని చాలా సార్లు చెప్పారు.


అక్కినేని హీరోల పేర్ల ముందర ‘నాగ’ అనే పేరుంటుందన్న సంగతి తెలిసిందే.. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ సుశీల, నాగచైతన్య.. వీరి పేర్లకు ముందు ‘నాగ్’ అదే పదం కామన్ గా వచ్చింది. దీనికి కారణమేంటో తెలుసా.. ఇలా ‘నాగ’ వచ్చేలా తమ పేర్లను ఎందుకు పెట్టారో ఓ ఇంటర్వ్యూలో హీరో నాగార్జున చెప్పుకొచ్చారు. ‘మా నానమ్మ కడుపులో నాన్న నాగేశ్వరరావు ఉన్నప్పుడు రోజూ కలలో నాగుపాము వచ్చేదట. నాన్న పుట్టిన తర్వాత ఇంకా పేరు కూడా పెట్టని కొద్ది రోజులకే.. ఓ రోజు పాలు ఇస్తుండగా నానమ్మకు నాగుపాము పిల్ల కనిపించిందట. అందుకని నాగేశ్వరరావు అని పెట్టారు. ఆ తర్వాత అది నాకు, నాగ సుశీలకు.. ఇలా నాగచైతన్యకు కొనసాగింది.’ అని నాగార్జున ఆ సెంటిమెంట్ గురించి వివరించాడు.


నాగార్జునకు చైతన్య పుట్టిన తర్వాత చైతన్య అని పేరు పెట్టారట. అప్పుడు నాగార్జున వాళ్ల అమ్మగారు పిలిచీ మరీ చెప్పారట.. నాగ్ జత చేయమని.. దీంతో నాగచైతన్యగా మార్చామని వివరించారు నాగార్జున. నాగ తమకు సెంటిమెంట్ గా కలిసి రావడంతో ఇప్పటికీ కొనసాగిస్తున్నామని నాగార్జున పేర్కొన్నారు. నాగ పేర్ల వెనుకున్న రహస్యం ఇదన్నమాట..


మరింత సమాచారం తెలుసుకోండి: