ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘మహర్షి’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ అభిమానులతో పాటు నమ్రత కూడ ఫుల్ జోష్ లో ఉంది. ఈ విషయమై తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ నమ్రత షేర్ చేసిన ఫోటో మహేష్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ‘మహర్షి’ సినిమా కోసం మహేష్ ఎంత కష్టపడ్డాడో వివరిస్తూ ఈమూవీ అతడి కెరియర్ లో ఒక మరిచిపోలేని మూవీ అవుతుందనీ ఈమూవీ కోసం కష్టపడ్డ టీమ్ అందరికీ నమ్రత కృతజ్ఞతలు తెలియ చేసింది. 

‘మే 9 బిగ్ డే మహర్షి సినిమా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత అంకింత భావంతో పని చేశావో తెలుసు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే పూర్తి నమ్మకం ఉంది’ అంటూ నమ్రత శిరోద్కర్ తన ఇన్‌‌స్టాగ్రామ్ పేజీలో పెట్టిన కామెంట్ మహేష్ అభిమానులకు బాగా కనెక్ట్ అయింది.  నమ్రత తన కామెంట్ తో పాటు మహేష్ ను ఆలింగనం చేసుకుని చిన్న పిల్లాడిలా మహేష్ ముద్దు చేస్తున్న ఈఫోటో పై మహేష్ అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

మహేష్ ను మరీ చిన్న పిల్లవాడిలా చూడవద్దు అంటూ మీ జంట ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవానికి నమ్రత ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మనస్తత్వం గురించి మాట్లాడుతూ మహేష్ ప్రవర్తన ఒకొక్కసారి తమ ఇంటిలో చిన్న పిల్లవాడిలా ఉంటుందని మహేష్ తన పిల్లలతో అల్లరి చేస్తూ ఇంటిలోని వస్తువులు అన్నీ చిందరవందర చేసినప్పుడు అవన్నీ సద్దుకోవడానికి  తనకు రోజంతా సరిపోతుంది అంటూ జోక్ చేసింది. 

మహేష్ ను కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించి సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం మహేష్ నమ్రతల ప్రేమను అంగీకరించేదాకా నాలుగు సంవత్సరాలు ఎదురు చూసిన నమ్రత ఓర్పును ఇప్పటికీ ఫిలిం ఇండస్ట్రీలో చాల గొప్పగా చెప్పుకుంటారు. మహేష్ ను సూపర్ స్టార్ గా తీర్చిదిద్దే విషయంలో నమ్రత సలహాలతో పాటు నమ్రత వ్యూహాలు కూడ ఎంతో మహేష్ ను ప్రభావితం చేస్తున్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్..    


మరింత సమాచారం తెలుసుకోండి: