సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోల ఊపుతో, సూపర్ టాక్ తో అదరగొడుతున్న 'మహర్షి'కి  సంబంధించి మరో న్యూస్ కూడా హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో కంటెంట్ ఇప్పుడు ఇతర భాషలకు చెందిన పలువురు అగ్ర కథానాయకులకు కనెక్ట్ అవుతోందట. సినిమాలో ఉన్న ప్రధానాంశం ఏ భాషలో అయినా వర్కవుట్ అయ్యే అవకాశాలుండటంతో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు బాలీవుడ్ మీడియా సమాచారం. 


ఈ సినిమాలోని కంటెంట్ గురించి సల్లూ భయ్యాకు వివరించిన దర్శకుడు ప్రభుదేవా ఈ రోజు సాయింత్రం అతని కోసం ముంబయ్ లో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సినిమా నచ్చితే ఈ మూవీని రీమేక్  చేసేందుకు సల్మాన్ చాలా ఆసక్తిగా ఉన్నాడట. తన సొంత బ్యానర్ లో ప్రభుదేవా దర్శకత్వంలోనే ఈ మూవీ ఉంటుందని టాక్. గతంలో వీరిద్దరూ మహేష్ బాబు 'పోకిరి' మూవీని 'వాంటెడ్' గా రీమేక్ చేసి బాలీవుడ్ లో భారీ  హిట్ కొట్టిన విషయం తెలిసిందే. 


'మహర్షి'పై సల్మాన్ ఖాన్ తో పాటు అటు కోలీవుడ్ లో విజయ్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడని అంటున్నారు. సినిమా అనుకున్న రీతిలో హిట్ అయితే దాన్ని తమిళంలోకి రీమేక్ చేసేందుకు విజయ్ కూడా సిద్ధమని తమిళ సినీ వర్గాలు చెపుతున్నాయి. మొత్తానికి 'మహర్షి' తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ ఇటు కోలీవుడ్ లోనూ సెన్సెషన్ ను క్రియేట్ చేస్తోందని మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: