ఫస్ట్ లుక్ నుండి సెన్సేషన్ గా మారిన సినిమా మజిలీ. ఈ కొత్త పెళ్లి జంట కలిసి చేసిన మొదటి ప్రాజెక్ట్ ‘మజిలీ’ సినిమా. చై-సామ్ అభిమానులకు కన్నుల పండుగగా నిలిచింది. ఏంతో మందికి ఈ సినిమా కనెక్ట్ అయింది. డైరెక్టర్ శివ నిర్వాణకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది అనే చెప్పొచ్చు. ఏప్రిల్ 5న విడుదులైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు.


మొదటి రెండు వారల్లోనే 50కోట్లపైగా గ్రాస్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లందరికీ మంచి లభాలనే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ‘మజిలీ’ థియేటర్ లో విడుదల అయినప్పుడే చిత్రలహరి, జెర్సీ, కాంచన 2, అవెంజర్స్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎటాక్ చేసాయి కానీ మజిలీ వసూళ్లు పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

Image result for majili pictures

సమంత, నాగ చైతన్య నటన గురించి ఇక చెప్పనవసరం లేదు. రియల్ లైఫ్ జంట, సినిమా పరమైన క్యారెక్టర్ లో అందరిని ఎమోషనల్ చేసారనే చెప్పుకోవాలి. ఏంతో మంది యువకులు ‘శ్రావణి’ లాంటి అమ్మయి కావాలని ఫిక్స్ అయ్యారని టాక్.


ఈ చిత్రంతో పరిచయం అయిన దివ్యాంన్ష కౌశిక్ కు మంచి ఆదరణ లభించింది. తమిళ, కన్నడ చిత్రాలలో అప్పుడే కొంతమంది దర్శకులు ఆమెను తమ సినిమాలలో ఎంపిక చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మజిలీ చిత్రం యొక్క కలెక్షన్ ల మజిలీ ఇంకా కొనసాగుతునే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: