ఏన్నో సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు చేస్తూ అవకాశం కోసం ఏడురుచుస్తూ, ఒక్క సినిమాతో తానెంటో నిరూపించుకున్న విజయ్ స్టైలే వేరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఒక మాస్ అండ్ క్లాసు మిక్సింగ్ పాత్రలో యూత్ ని ఉర్రుతలుగించాడు విజయ్. ఒక్కసారిగా అర్జున్ రెడ్డి ఒక సెన్సేషన్ గా మారిపోయింది. అలనే విజయ్ కెరీర్ ని కూడా మార్చేసింది. కుర్రకారు మెచ్చిన సినిమాగా ముద్రవేసుకుంది. ఒక్కసారిగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు టాక్ వెళ్లిపోయింది. ఇదే సినిమా పలు బాషలలో కూడా చిత్రీకరణ మొదలైంది. విజయ్ రేంజ్ ఏ మారిపోయింది.


అంతే కాదు అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వచ్చిన రెండు సినిమాలు విజయ్ కి హ్యాట్రిక్ ని తెచ్చిపెట్టయనే చెప్పొచ్చు. గీత గోవిందం, టాక్సీవాల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గణ విజయాన్ని అందుకున్నాయి. మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. ఇదిలా ఉండగా విజయ్ బయట కూడా తన విభిన్నమైన ఆలోచనలతో తన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు అనడంలో సందేహం లేదు, ఆ ఆలోచనే విజయ్ ఐస్ క్రీం ట్రక్.

Image result for vijay devarakonda bday ice cream truck pictures

విజయ్ ఐస్ క్రీం ట్రక్ హైదరాబాదులో ప్రజలను ఆకట్టుకుంది. ఈ ట్రక్ విజయ్ పేరు మీద ఉచితంగా ఐస్ క్రీం ను పంపిణి చేస్తున్నారు. దేనితో ఫ్యాన్స్ విజయ్ కి ఫిదా అయ్యారు. కొన్ని రోజులు మాత్రమే ఈ ట్రక్ లు తిరిగాయి. ఈరోజు మే 9 విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో విజయ్ తన ఫేస్ బుక్ లో ‘నాకు ఐస్ క్రీం అంతే ఇష్టం, మీరంన్న, మీ మొహంలో ఆనందం అన్నా ఇంకా ఇష్టం. అందుకి నా పుట్టిన రోజు సందర్బంగా బర్త్ డే ట్రక్ కొంచెం పెద్ద స్థాయిలో రాబోతుంది. అని పోస్ట్ చేసాడు విజయ్.


విజయ్ ఐస్ క్రీం ట్రక్ ఈరోజు హైదరాబాదు, విజయవాడ, వరంగల్, తిరుపతి, బెంగులూరు, చెన్నై ఇంకా కొచ్చిలో పంచుతున్నారు. విజయ్ కొత్త సినిమా “డియర్ కామ్రేడ్” సినిమా జూలై 24వ తేదిన రిలీజ్ అవ్వబోతుంది. విజయ్ ఫాన్స్ ఇప్పటికే ఫిలిం అప్డేట్లును సోషల్ మీడియాలో ఫాలో అవ్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: