తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డుల విషయంలో 'బాహుబలి' ఒక ల్యాండ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా విభిన్న భాషల్లో వచ్చిన 'బాహుబలి' రికార్డులను తిరడరాయడం తెలుగులో కమర్షియల్ సినిమాలకు సాధ్యమయ్యే పనికాదు. అందుకే 'నాన్‌ బాహుబలి రికార్డ్స్' అనే కొత్త పదాన్ని క్రియేట్ చేసారు. 'నాన్‌ బాహుబలి' రికార్డుల విషయంలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ 'రంగస్థలం' మాత్రమే. భారీ కలెక్షన్స్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ స్టార్‌డమ్ ను అమాంతం పెంచిన 'రంగస్థలం' మూవీ రికార్డులు గడిచిన ఏడాది కాలంగా పదిలంగా ఉన్నాయి. 


అయితే ఈరోజు రిలీజైన మహేష్‌బాబు 'మహర్షి' మూవీ 'రంగస్థలం' రికార్డులను బీట్ చేస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించిన బెనిఫిట్ షోస్, ప్రస్తుత మూవీ టాక్ చూసుకుంటే 'రంగస్థలం' కలెక్షన్స్ ను దాటేయడం 'మహర్షి'కి పెద్ద కష్టం కాదని మహేష్ ఫ్యాన్స్ నమ్మకంగా చెపుతున్నారు. చాలా రోజుల నుంచి రికార్డుల విషయంలో అసంతృప్తిగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ 'మహర్షి' మూవీతో ఆ లోటు తీర్చుకోవాలని  కొత్త నాన్‌ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నారు. 


మరోవైపు టిక్కెట్స్ రేట్లు పెంచి భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలు వేయడంపైనే విమర్శలు చెలరేగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. 'రంగస్థలం' రిలీజ్ టైంలో ఎటువంటి బెనిఫిట్ షోలు వేయలేదని గుర్తు చేస్తున్నారు. ఈ చర్చను పక్కన పెడితే 'మహర్షి' , 'రంగస్థలం' రికార్డులను కొల్లగొడుతుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: