టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచనాలతో వచ్చిన మహర్షి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది సినిమాలో చాలా కంప్లైంట్ లో ఉన్న దర్శకుడు సెకండాఫ్ లో ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ వ్యవసాయానికి లింకు పెట్టి నడిపించడం ప్రేక్షకులకు నచ్చింది. ఫస్టాఫ్ లో చాలా సీన్లు బాగా సాగదీసినట్లు ఉండడంతో ప్రేక్షకులు ఒకానొక దశలో తీవ్రమైన అసహనానికి లోనయ్యారు. కొంతమంది బోరింగ్ సీన్లు బాగా ఎక్కువ ఉన్నాయని సైతం చెప్పారు. కథలో చెప్పాలనుకున్నా కీలక సీన్లలో మంచి పనితీరు కనబరిచిన‌ దర్శకుడు వంశీ సెకండాఫ్‌ను కథాపరంగా ఎమోషనల్ గా ఈ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయినా... చాలా సీన్ల‌ను మరింత ఆసక్తిగా మలిచే స్కోప్ ఉన్నా దర్శకుడు ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు కనిపించలేదు.


ఫ‌స్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య కాలేజ్ నేపథ్యంలో వచ్చే లవ్ సీన్లు చాలా తక్కువగా ఉన్నాయి. అనుకుంటే అవి కూడా అంత ఆసక్తిగా లేవు. ఫ‌స్టాఫ్‌ను బాగా సాగ‌దీస్తూ.... న‌డిపించిన వంశీ  సెకండాఫ్ లోనూ తొలి 20 నిమిషాలు కథనం సైతం మరింత సాగదీయడం తో అసలు కథ లోకి ఎంటర్ అయ్యేందుకు చాలా సమయం పట్టేసింది. ఇక మహర్షి సినిమాకు టోటల్ గా సెకండాఫ్ లో వచ్చే చివరి 40 నిమిషాల సన్నివేశాలు ఆయువుపట్టుగా నిలిచాయి. వ్యవసాయం గురించి చెప్పిన డైలాగులు ఆకట్టుకొంటాయి. ప్రతి రైతు తమ బిడ్డలను ఎందుకు రైతులుగా చేయడానికి ఇష్టపడటం లేదో.. రైతు ఎందుకు భయంతో బ్రతుకుతాడో అంటూ చెప్పిన డైలాగులు ప్రతి ఒక్కరి మనసులను కదిలించాయి. మహేష్ చివర్లో  వ్యవసాయం చేయడం... రైతుల అందరిని తిరిగి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడం లాంటి అంశాలు సినిమా మేజర్ హైలైట్స్‌లో ఒక‌టి.


రైతుల భూముల కోసం ఒక కార్పొరేట్ కంపెనీ దౌర్జన్యం... ఓ విలన్ రైతుల భూములు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు చేస్తున్న కుట్రలు.... మధ్యలో రాజకీయాలకి లింకు ఇవన్నీ గతంలో చూసినవే... అందుకే ఇందులో పాత సినిమాల ఛాయలు కూడా కనిపిస్తాయి. ఈ లైన్ కంటే వంశీ రైతులు కష్టాల్లో తమ జీవితానికి సరిపడని వ్యవసాయ ఆదాయం... గిట్టుబాటు ధర... రైతుల ఆత్మహత్యలు... పెరుగుతున్న ఖర్చులు లాంటి అంశాలను బేస్ చేసుకుని కథ‌ను రాసుకున్నట్లయితే మహర్షి రేంజ్ ఇంకా వేరుగా ఉండేది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వీకెండ్ వ్యవసాయం... అపార్ట్ మెంట్లు నేరుగా రైతుల నుంచి పంటల కొనుగోలు చేయటం లాంటి అంశాలు కొత్తగా ఉన్నా ఇది ఇది ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయిన వంశీ సీన్లు సరిగా డిజైన్ చేయలేదు. ఏదేమైనా మహర్షి సినిమాకు చివరి 40 నిమిషాల పాటు వచ్చే వ్యవసాయం సాయం చేసింది. ఇదే సినిమాను గ‌ట్టెక్కించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: