మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌తో దూసుకు వెళుతోంది. సినిమాకు మ‌రీ సూప‌రెహే అన్న టాక్ లేక‌పోయినా సెకండాఫ్ సినిమా గ్రాఫ్‌ను పెంచ‌డంతో ప‌ర్లేదు అన్న వారే ఎక్కువుగా ఉంటున్నారు. ఇక ఈ సినిమాను చూస్తున్నంత సేపు గ‌తంలో మ‌హేష్ న‌టించిన హిట్ సినిమాలే కాదు... మ‌రికొన్ని హిట్ సినిమాలు సైతం థియేట‌ర్లో ప్రేక్ష‌కుల క‌ళ్ల‌ముందే క‌ద‌ల్లాడుతుంటాయి.


మ‌హ‌ర్షి చూస్తున్నంత సేపు మ‌హేష్ గతంలో న‌టించిన ప‌లు సినిమాలు గుర్తుకొచ్చాయి. 2006లో వ‌చ్చిన మ‌హేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్ పోకిరిలో ర‌న్నింగ్ షాట్ ఇక్క‌డ కూడా అలాగే ఉంది. ఇక ముందు కార్పొరేట్ క‌ల్చ‌ర్‌లో ఉండే హీరో ఆ త‌ర్వాత వ్య‌వ‌సాయం చేయ‌డం అనేది శ్రీమంతుడు సినిమాలో ఆల్రెడీ చూసేశాం. ద‌ర్శ‌కుడు వంశీ క‌థ మీద కాన్‌సంట్రేష‌న్ చేయకుండా 3 ఇడియ‌ట్స్ కొంత‌, శ్రీమంతుడు మ‌రికొంత‌, భ‌ర‌త్ అనే నేను ఇంకొంత... సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ర‌ఘువ‌ర‌ణ్ బీటెక్‌, ర‌జ‌నీకాంత్ - జ‌గ‌ప‌తిబాబు న‌టించిన క‌థానాయ‌కుడు సినిమాల‌ను మిక్సీలో వేసేసి జ్యూస్ తీసేసి మ‌హ‌ర్షిని క‌థ‌ను కాపీ పేస్ట్‌గా ఎత్తేశాడ‌ని అనిపిస్తోంది.


ఇక ప్ర‌పంచాన్ని ఏలేస్తాన‌నే డైలాగ్ బిజినెస్‌మేన్ సినిమాలోని ముంబ‌య్ ని ఉచ్చ‌పోయించ‌డానికి వ‌చ్చా అన్న డైలాగ్‌కు కాస్త అటూ ఇటూగా స‌రిపోతుంది. ఇక పేద‌ల‌ను ఆదుకునే విష‌యంలో హీరో కార్పొరేట్ శ‌క్తుల మీద పోరాటం చేయ‌డం అన్న‌ది శ్రీమంతుడు సినిమాలో చూసేశాం. ఇక రైతుల స‌మ‌స్య‌ల‌పై హీరో పోరాటాలు చేయ‌డం ఖైదీ నెంబ‌ర్ 150 లాంటి సినిమాల్లో ఉన్న‌దే. పోనీ దానినే ఇక్క‌డ ద‌ర్శ‌కుడు కొత్త‌గా చూపించింది లేదు. వంశీ పైడిప‌ల్లి సినిమాల్లో కొత్త క‌థ‌న‌లు ఆశించ‌లేం. ఇక పాత క‌థ‌ల‌నే అటూ ఇటూ తిప్పినా టేకింగ్ ప‌రంగాను మ‌హ‌ర్షి విష‌యంలో చాలా త‌డ‌బ‌డ్డాడు. ఓవ‌రాల్‌గా సెకండాఫ్ చివ‌రి 40 నిమిషాలు, ఎమోష‌న‌ల్ సీన్లే సినిమాను ఒడ్డుకు చేర్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: