కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ అక్కడే కాదు తెలుగు లో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  ఈ మద్య వరుసగా తెలుగు లో కూడా విజయ్ చిత్రాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  అదిరింది, సర్కార్ తెలుగులో కూడా మంచి హిట్ అయ్యాయి.  అయితే విజయ్ స్వతహాగా ఏ విషయంలో జోక్యం చేసుకోరని..సామాజిక సేవా విషయంలో ముందుంటారని అంటారు. ఆయనపై ఇప్పటి వరకు ఎంటాంటి కాంట్రవర్సీలు కూడా రాలేదు.  తాజాగా విజయ్ పై  మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

విజయ్ సూపర్ స్టార్ కావచ్చేమో కానీ సూపర్ నటుడు మాత్రం కాదని ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.  అయితే మాలీవుడ్ లో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి గొప్ప నటులు ఉన్నందుకు మలయాళ చిత్ర పరిశ్రమ అదృష్టం చేసుకుందని..వారి సహనటుల పట్ల ఎందో ఔదార్యంతో ఉంటారని అన్నారు. 

ప్రతి ఇండస్ట్రీలోనూ సూపర్ స్టార్ లు ఉంటారని..మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాంటి వారి చలువ వల్లే  జీవించగలుగుతున్నారని.. కానీ తమిళ పరిశ్రమలో పరిస్థితులు మరోలా ఉంటాయని అన్నారు. అయితే విజయ్ కి స్టార్ డమ్ ఉండటం వల్లే..ఇంకా రాణిస్తున్నాడని..ఆయన సూపర్ యాక్టర్ ఏమీ కాదని, ఆయన్ని స్టార్ డం నడిపిస్తోందని అన్నారు. తన దృష్టిలో కమల్ హాసన్ మంచి నటుడు అన్నాడు.  తాజాగా   సిద్ధిఖీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: