సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక రిషి పాత్రలో మహేష్ మరోసారి తన నటనా ప్రతిభతో మెప్పించాడు. సినిమాలో అల్లరి నరేష్ రవి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా కథ అనుకున్నప్పుడు రవి పాత్రకు ఎవరైతే బాగుంటారో అని ఆలోచించగా అల్లరి నరేష్ గుర్తుకొచ్చాడట.


అలా రవి పాత్రకు వంశీ పైడిపల్లి నరేష్ ను అడగటం ఆయన ఓకే చెప్పడం జరిగింది. ఇదిలాఉంటే మహర్షి సినిమాలో రిషి తర్వాత అంత స్కోప్ ఉన్న పాత్ర అంటే అది నరేష్ చేసిన రవి పాత్రే. మహర్షి సినిమాకు రిషి ఎంత ఇంపార్టెంటో రవి పాత్ర కూడా అంతే ప్రాముఖ్యత వహించాడు. ఒకానొక దశలో సెకండ్ హాఫ్ లో మహేష్ వెనుక నడిపిస్తూ రవికి పేరు రావాలని చూస్తాడు.


రవి పాత్రలో అల్లరి నరేష్ తన సహజ నటనతో మెప్పించాడు. ఇక కత్తిపోట్లతో కూడా నరేష్ మరోసారి గమ్యం సినిమాలోని గాలి శీను పాత్రని గుర్తుచేస్తాడు. కచ్చితంగా గమ్యం, శంభో శివ శంభో మూవీల తర్వాత మహర్షి వస్తుంది. ఈ సినిమాల్లో అల్లరి నరేష్ పాత్రలే చాలా ఇంపార్టెంట్ గా నడిచాయి. మహర్షిలో అల్లరి నరేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా ప్రమోషన్స్ లో అతన్ని సైడ్ చేసినట్టు కనిపించినా సినిమాలో మాత్రం మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చి అతని క్రెడిబులిటీకి ఆటంకం కలగకుండా చేశారు.


సో కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరోడికి మహర్షితో సూపర్ సక్సెస్ దొరికిందనే చెప్పొచ్చు. సినిమాలో రవి పాత్రకు అల్లరి నరేష్ తప్ప మరెవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు నరేష్. ముఖ్యంగా మహేష్, అల్లరి నరేష్ ల కాంబినేషన్ లో సీన్స్ అన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. రవిగ ఇన్నోసెంట్ రోల్ లో నటించి మెప్పించిన అల్లరి నరేష్ ను మహర్షి హిట్ ట్రాక్ ఎక్కించేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: