మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. ఓ యావ‌రేజ్ టాక్ లేదా... ఇంకా చెప్పాలంటే ప్లాప్ టాక్ వ‌చ్చిన సినిమాల‌పై కూడా జ‌ర‌గ‌ని చ‌ర్చ మ‌హ‌ర్షి మీద న‌డుస్తోంది. ఇందుకు సినిమాలో లెక్క‌లేన‌న్ని మిస్టేక్‌లు ఉండ‌డమే ప్ర‌ధాన కార‌ణం. సినిమాలో చాలా చోట్ల సోష‌ల్ మెసేజ్‌ను బ‌లంగా చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డిన ద‌ర్శ‌కుడు వంశీ ఈ క్ర‌మంలోనే సినిమా క‌థ‌ను సాఫీగా న‌డిపించ‌లేక చాలా చోట్ల త‌డ‌బ‌డ్డాడు. లెక్క‌లేన‌న్ని త‌ప్పులు చేశాడు. సినిమాలో చాలా సీన్లు లెన్దీగా ఉన్నాయి. వాటిని అస‌లు ఎందుకు ?  ఉంచారో కూడా ఎవ్వ‌రికి అర్థం కాదు.


సోష‌ల్ థీమ్ ఉన్న కంటెంట్‌ను క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్చింగ్‌లో హిట్ ఇవ్వ‌డం శంక‌ర్‌కే సాధ్య‌మైంది. ఆ త‌ర్వాత మురుగ‌దాస్‌, కొర‌టాల శివ లాంటి వాళ్లు మాత్ర‌మే ఈ ప్ర‌యత్నంలో స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు మ‌హేష్ 25వ సినిమాకు ద‌ర్శ‌కుడు వంశీ అదే ప్ర‌య‌త్నం చేసినా పైన చెప్పుకున్న ద‌ర్శ‌కుల్లా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మ‌య్యాడు. మ‌హేష్ తండ్రి క్యారెక్ట‌ర్‌కు మ‌హేష్‌కు కావాల్సినంత రిలేష‌న్ మెయింటైన్ చేసే స్కోప్ ఉన్నా ద‌ర్శ‌కుడు వాటిని బిల్డ‌ప్ చేయ‌లేదు. మ‌హేష్ త‌ల్లిదండ్రులుగా ప్ర‌కాష్‌రాజ్ - జ‌య‌సుధ లాంటి టాలెంటెడ్ న‌టులు ఉన్నా వారిని ఏ మాత్రం వాడుకోలేదు.


అమెరికాలో ఒక బడా కంపెనీకి సీఈవోగా అయ్యాక త‌న కెరీర్ ఎదుగుద‌ల‌కు త‌న ఫ్రెండ్ ర‌వి ( అల్ల‌రి న‌రేష్‌) చేసిన త్యాగం తెలుసుకుని అక్క‌డ నుంచి గోదావ‌రి జిల్లాలోని ఓ ప‌ల్లెటూర‌కు వ‌చ్చేయ‌డం... త‌న సీఈవో పోస్టును ఇక్క‌డ నుంచే చేయ‌డం... చివ‌ర‌కు దానికి రిజైన్ చేయ‌డం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో త్యాగాలు, మెసేజ్‌లు ఉంటాయి. అయితే అవి ప్రేక్ష‌కుడికి ఎంత వ‌ర‌కు కనెక్ట్ అయ్యాయ‌ని చెప్పుకుంటే మాత్రం డౌటే. సినిమాకు చివ‌ర్లో మెసేజ్ అవ‌స‌ర‌మే అయినా సినిమాను లెక్క‌కు మిక్కిలిగా మెసేజ్‌ల‌తో ఉండ‌డంతో ఈ లాంగ్ జ‌ర్నీని వీక్షించేందుకు చాలా ఓపిక కావాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: