ఎదురు చూపులు ఫలించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మహేష్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అతడి 25వ సినిమా ‘మహర్షి’ ఈ రోజే థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రం ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ కావడం.. ‘ఎఫ్2’ కాకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా మరేదీ లేకపోవడంతో ఇప్పుడందరి చూపూ ‘మహర్షి’ మీదే ఉంది.


ఫలితం విషయంలోనూ ల్యాండ్ మార్క్ ఫిలిం అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. సినిమాకు ఉన్న హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం చూస్తే దీనికి ఓపెనింగ్స్ విషయంలో ఢోకా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు పెంచారు. అదనపు షోలు వేస్తున్నారు కాబట్టి తొలి రోజు, తొలి వారాంతం వసూళ్లు భారీగానే ఉండొచ్చు. కానీ పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ఓపెనింగ్స్ విషయంలో కుమ్మేస్తాయి. 'భరత్‌ అనే నేను' మంచి టాక్‌తో ఓపెన్‌ అయినా కానీ దానికి రికార్డులేమీ రాలేదు. వంద కోట్ల షేర్‌ సాధించే తొలి మహేష్‌ చిత్రమవుతుందని భావించినా కానీ అంత దూరం వెళ్లలేదు. భరత్‌ అనే నేను అండర్‌ పర్‌ఫార్మెన్స్‌కి రంగస్థలం ఒక కారణంగా చెప్పవచ్చు. 


అయితే ఈసారి మాత్రం 'మహర్షి'కి అలా మార్కెట్లో ఎదురు పడే పెద్ద సినిమా ఏదీ లేదు. ఏప్రిల్‌లో వచ్చిన సినిమాల్లో చాలా వరకు హిట్టయినా కానీ అవేమీ మహర్షి స్కేల్‌ని మ్యాచ్‌ చేయలేవు. ఫ్యాక్ట్‌ మాట్లాడుకుంటే, మహర్షి తొలిరోజు వసూళ్లంత వుండదు వాటి లైఫ్‌ టైమ్‌ బిజినెస్‌. అందుకే మహర్షికి ఈసారి ఎక్స్‌టర్నల్‌ ఫోర్సులేవీ ఇబ్బందిగా మారవు. సినిమా బాగుందనే టాక్‌ తెచ్చుకుంటే సంచలనాలు సృష్టించవచ్చు. 




మరింత సమాచారం తెలుసుకోండి: