సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా గురువారం భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. అంచ‌నాలు అందుకోవ‌డంలో కాస్త త‌డ‌బ‌డినా ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఇక ఓవ‌ర్సీస్లో మ‌హేష్ సినిమాల‌కు ఉండే క్రేజే వేరు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాహుబ‌లి సినిమాల‌ను బ్రేక్ చేస్తూ ఓవ‌ర్సీస్‌లో మ‌హ‌ర్షి సినిమాకు 2500 ప్రీమియ‌ర్ షోలు వేశారు. సోలో రిలీజ్ ద‌క్క‌డంతో మ‌హ‌ర్షి టాలీవుడ్‌లోనే సెకండ్ బిగ్గెస్ట్ రిలీజ్ సినిమాగా నిలిచింది. 


ప్రీమియ‌ర్ల ద్వారా మ‌హ‌ర్షికి  $ 4, 55,060 డాలర్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ యేడాదిలో ఇవే హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్లు. ఈ జాబితాలో త‌ర్వాత ప్లేసుల్లో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు $ 4, 42,998 - F2 $ 2, 51,263 - వినయవిధేయ రామ $ 1, 81,118 - జెర్సీ $ 1, 44,687, మజిలీ $ 1, 40,454 చిత్రాలు తరువాతి స్థానంలో ఉన్నాయి. మ‌హ‌ర్షికి ఓవ‌ర్సీస్లో అనుకున్న అంచ‌నాల‌తో పోలిస్తే క‌లెక్ష‌న్లు బాగా డ‌ల్ అయ్యాయి. మహర్షి తొలిరోజు యూఎస్ ప్రీమియర్ షో కలెక్షన్లు ఆగడు, స్పైడర్‌లకంటే వెనకబడినట్టు తెలుస్తోంది. 


మ‌హ‌ర్షికి అక్క‌డ ప్రీమియ‌ర్ల‌తో  $ 4, 55,060 డాల‌ర్లు ద‌క్కాయి. స్పైడర్ $ 1,005,630 కలెక్షన్లను రాబట్టింది. మిగతా సినిమాల విషయానికి వస్తే.. భరత్ అనే నేను $ 8, 00,000, బ్రహ్మోత్సవం $ 5, 60,000, శ్రీమంతుడు $ 5, 36,000, ఆగడు $ 5, 24,000 రాబట్టింది. ఏదేమైనా పాజిటివ్ టాక్ వ‌చ్చినా మ‌హ‌ర్షి మ‌హేష్ డిజాస్ట‌ర్లు అయిన ఆగడు, స్పైడర్, బ్రహ్మోత్సవం చిత్రాలకంటే ప్రీమియ‌ర్ల‌లో వెన‌క‌ప‌డ‌డం షాకింగే.


మరింత సమాచారం తెలుసుకోండి: