"హృదయ కాలేయం" సినిమాతో సంపూర్ణేష్ బాబు ఓవర్ నైట్ బర్నింగ్ స్టార్ అయిపోయాడు. దర్శక ధీరులు రాజమౌళీ ఒక్క ట్వీట్ తో, ఒకే ఒక్క థియోట్రికల్ ట్రైలర్ తో సంపూ సృష్ఠించిన సునామీ దేశాలను గడ గడ లాడించింది. ఇక హృదయకాలేయం సినిమా రిలీజైయ్యాక యావత్ ప్రపంచం మొత్తం సంపూ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేక గూగుల్ తల్లి కూడా స్ట్రక్ అయిపోయి షడ్డౌనైంది. అదీ సంపూ సంపాదించిన పాపులారిటీ. ఇలా సంపూ గురించి చెప్తూ పోతే రాయడానికి పెన్నులు, పేపర్లు, టైప్ చేయడానికి నోట్ ప్యాడ్‌లు, కీ బోర్డ్‌లు ఏవీ సరిపోవు.

మరి ఈ బర్నింగ్ స్టార్ ఇంతటి తో ఆగాడా, మంచు మనోజ్ దగ్గర్నుంచి సన్నీ లియోన్ నే ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత సన్నీ ని ఎక్కడ దాచాడో, ఏం చేశాడో గాని ప్రేక్షకుల ముందుకు మాత్రం ఏమీ ఎరగనట్టుగా "కొబ్బరి మట్టతో" వస్తున్నాడు. పోయింది ఒక్కడైతే తిరిగొస్తుంది మాత్రం ముగ్గురు. "పాపారాయుడు", "పెదరాయుడు", "ఆండ్రాయుడు". ఒక్కడిగా వస్తేనే సునామీ సృష్ఠంచాడు. ఈ సారి ముగ్గురుగా వచ్చి ఏంచేస్తాడో. ఈ విషయం పక్కన పెడితే విజయ్ దేవరకొండ తో కలిసి ఫుల్ లెంగ్త్ కామిడీ ఎంటర్‌టైనర్ చేస్తే బావుంటుందని అందరు అనుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణా నుంచి ఉన్న సూపర్ స్టార్లు వీళ్ళే కాబట్టి. 


యూత్ లో మంచి ఫాలోయింగ్, అమ్మాయిల్లో ఓ రేంజ్ క్రేజ్ ఉన్న విజయ్, 24/7 బర్నింగ్ లో ఉండే సంపూ కలిసి సినిమా చేస్తే "బాహుబలి", "రోబో" రికార్డ్స్ బద్దలవడం ఖాయం. ఇక ఫ్యాన్స్‌కైతే తమ స్టార్ హీరో ఒక్కడిని స్క్రీన్ మీద చూసుకుంటేనే పూనకాలొచ్చేస్తాయి. మరి ఒకే సారి ఇద్దరు స్టార్స్ ని 70mm స్క్రీన్ మీద చూస్తుంటే హృదయం, కాలేయం సపరేట్ అవడం ఖాయం. మరి విజయ్-సంపూ కాంబినేషన్ ని ఎవరు సెట్ చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: