మే 9 వ తారీకు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు ఐస్ క్రీం పంచుతూ సోషల్ మీడియాలో హడావిడి చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో చేతినిండా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొడుతున్న విజయ్ దేవరకొండ సౌత్ ఇండియా లో క్రేజ్ కలిగిన హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

Related image

ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందుస్థాన్ టైమ్స్ సంస్థ నిర్వహించిన ఇండియాస్ మోస్ట్ స్టైలిస్ట్ స్టార్ అవార్డ్స్ వేడుకలో విజయ్, హాటెస్ట్ స్టైలిష్ స్టార్ అవార్డును అందుకున్నారు. అయితే అవార్డును ప్రకటించే క్రమంలో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ ‘విజయ్ దేవరాకొండ’ అని సంబోధించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో విజయ్‌ను అభిమానులు ప్రేక్షకులు మిమ్మల్ని ఎన్ని రకాల పేర్లతో పిలుస్తారు అని ప్రశ్నించారు.

Image result for vijay devarakonda

దీనికి సమాధానంగా విజయ్ బదులిస్తూ...‘‘నాకు తెలిసినంతవరకు నా పేరును తప్పుగా రాసుకున్న తొలి వ్యక్తిని నేనే. స్కూల్లో ‘దేవెరకొండ’ అని రాశాను. అప్పటినుంచి అదే కొనసాగుతూ వస్తోంది. అలాగని నేను ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి నా పేరును సరిగ్గా పలకండి అని వారిని సరిదిద్దే రకాన్ని కాను. నాకు నా పేరు కరెక్ట్‌గా వినిపించినంత వరకు నాకేం సమస్య లేదు’’ అని తెలిపాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: