‘మహర్షి’ మూవీకి ఊహించిన విధంగా పాజిటివ్ టాక్ రావడంతో నిన్నరాత్రి మహేష్ ఈసినిమా యూనిట్ లోని కీలక సభ్యులకు మహేష్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండను కూడ మహేష్ ఆహ్వానించడంతో అతడు కూడ ఈ పార్టీకి రావడంతో ఈ పార్టీకి మరింత జోష్ ను ఇచ్చింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు విజయ్ ఈపార్టీలో హడావిడి చేయడమే కాకుండా మహేష్ తో అతి సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో వీరి సాన్నిహిత్యం చూసినవారు రానున్న రోజులలో వీరిద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ లో నటిస్తారా అని ఆ పార్టీకి వచ్చిన చాలామంది కామెంట్స్ చేసినట్లు టాక్. 

ఇలాంటి పార్టీలను హోస్ట్ చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న మహేష్ ఈ పార్టీకి వచ్చిన అందర్నీ పేరుపేరునా పలకరించడమే కాకుండా వారందరితో కలిసి జోక్స్ వేస్తూ కాలం గడిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈమూవీ నిర్మాతలతో పాటు బయ్యర్లు తమ టెన్షన్ నుండి బయటపడినా ఈమూవీ ఏ రేంజ్ హిట్ కు చేరుకుంటుంది అన్న విషయంలో ఇంకా స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నట్లు సమాచారం.

ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు లాభ పడాలి అంటే కనీసం 150 కోట్ల నెట్ కలక్షన్స్ రావలసిన నేపధ్యంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మహర్షి’ ని చూడటానికి రిపీట్ ఆడియన్స్ ఎంత వరకు వస్తారు అన్న విషయమై ‘మహర్షి’ రికార్డులు ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పట్లో ‘మహర్షి’ కి పోటీగా మరే సినిమా దరిదాపులో లేకపోవడంతో పాటు టాప్ హీరోల సినిమాలకు సగటు ప్రేక్షకుడు ఆతృతతో వేచి చూసిన నేపధ్యంలో ఇలా ఎలా చూసుకున్నా ‘మహర్షి’ బయ్యర్లకు నష్టాలు రావు అన్న ఖచ్చితమైన నమ్మకాన్ని నిన్నటి ‘మహర్షి’ టాక్ కలగచేస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: