గజినీ అన్నీ భాషల్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ సినిమాలో నయన తార సెకండ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే అయితే దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు తన పాత్ర గురించి ఒకలా చెప్పి.. చివరకు సిల్వర్ స్క్రీన్‌పై మరోలా చూపించారంటూ నయన్ ఆవేదన చెందింది. తన కెరీర్‌లో ‘గజినీ' సినిమా చేయడమే ఓ చెత్త నిర్ణయం అని నయన్ పేర్కొనడం గమనార్హం.


తన పాత్ర పరిధిని చాలా కుదించేసి ఇందులో చూపించారని చెప్పిన ఆమె.. గజినీ సినిమా అనుభవం తర్వాత పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త పడ్డానని చెప్పుకొచ్చింది. అదే ‘చంద్రముఖి' సినిమా విషయానికొస్తే అందులోనూ తాను చిన్న పాత్రే చేసినప్పటికీ సూపర్బ్ స్క్రీన్ ప్రెసెన్స్ చేశారని, ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపింది నయనతార. అయితే ఇన్నేళ్లకు గజిని పట్ల నయన్ ఇలా స్పందించడం చూసి ఆశ్చర్యపోతున్నారంతా.


చూడాలి మరి దీనిపై మురుగదాస్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది. కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగిన నయన్.. నేటికీ తన సత్తా చాటుతూనే ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నటిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అదే మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్' సినిమా సెట్స్‌పై చురుకుగా కదులుతోంది. ఇవిగాక ‘‘మిస్టర్ లోకల్, తలపతి 63'' చిత్రాల్లో నటిస్తోంది నయన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: