యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలను షేక్ చేసిన రాజశేఖర్ ఆతరువాత తన ప్రభావాన్ని అంతా కోల్పోయాడు. ఆతరువాత చాల గ్యాప్ తీసుకుని నటించిన ‘పీఎస్వీ గరుడ వేగ’ సినిమా రాజశేఖర్‌ కు ఆర్థికంగా ఎలాంటి లాభమూ తెచ్చిపెట్టలేదు. అంతేకాదు ఆసినిమాతో పేరు వచ్చినా రాజశేఖర్ కు చెప్పుకోతగ్గ అవకాశాలు కూడ రాలేదు. 

అయితే ఆమూవీ సక్సస్ రాజశేఖర్ కి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం బాగా కలిగించింది. ఇలాంటి పరిస్థుతులలో ఈ హీరో లేటెస్ట్ గా నటిస్తున్న ‘కల్కి’ టీజర్ బాగా యూత్ కు కనెక్ట్ అయింది. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకు రావడానికి ఈమూవీ ట్రైలర్ ను లేటెస్ట్ గా విడుదల చేశారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో రాజశేఖర్‌ ఉండి ఉంటే ఎలా ఉండేది అన్న ఊహతో ఒక కమెడియన్ ఇమిటేట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

అయితే రాజశేఖర్ ఇప్పుడు ఏకంగా తనను ఇమిటేట్ చేసిన ఆ కామెడీ నటుడుని ‘కల్కి’ సినిమాలో నటించేలా చేసి ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్‌ తో తనను తానే ఇమిటేట్ చేస్తూ రివర్స్ పంచ్ వేసుకున్నాడు. అదేవిధంగా ‘గబ్బర్ సింగ్’ మూవీలో పవన్ బాడీ లాంగ్వేజ్ ని కూడ ఇమిటేట్ చేస్తూ ఈ ట్రైలర్ లో ఉన్న సీన్ లో పెట్టడంతో ఈ ట్రైలర్ అందరికీ వెంటనే కనెక్ట్ అయిపోయింది. 

ఒకప్పుడు చిరంజీవి పవన్ లపై విపరీతమైన విమర్శలు చేస్తూ మెగా అభిమానుల ఆగ్రహానికి లోనైన రాజశేఖర్ ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ పంచ్ లను అనుసరించడం షాకింగ్ గా మారింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు బాగా హిట్స్ వస్తున్న నేపధ్యంలో ఈమూవీ బిజినెస్ కూడ బాగా జరుగుతున్నట్లు టాక్. ప్రశాంత వర్మ దర్శకత్వం వహించిన ఈమూవీ 1980 లో జరిగిన ఒక యదార్ధ క్రైం సంఘటనను ఆధారంగా చేసుకుని నిర్మించినట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: