అసలేమాత్రం సంబంధం లేకుండా స్టార్స్ ను ప్రాణంగా అభిమానించే వారు ఉంటారు. ఫలానా హీరోకి నేను అభిమానిని అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. మనకు వచ్చే పండుగలతో పాటుగా ఆ హీరో పుట్టినరోజు.. తన అభిమాన హీరో సినిమా రిలీజ్ కూడా పెద్ద పండుగే. ఇలా అభిమానించిన హీరో కోసం మన జీవితంలో కొంత స్పేస్ ఇచ్చేస్తాం. వాడు మా వోడు.. మా వాడు హిట్టు కొట్టాడు.. మా వాడికి టైం కలిసి రావట్లేదు. ఇలా ఆ స్టార్ తో ఎలాంటి రిలేషన్ లేకుండా అతన్ని మన ఫ్యామిలీలో మెంబర్ చేసుకుంటాం.


అయితే అభిమానమంటే చొక్కాలు చించుకోవడమే.. ఆ స్టార్ సినిమా కోసం బ్యానర్ కట్టి.. బాంబులు పేల్చి హడావిడి చేయడమో కాదు.. అభిమానమంటే ఆ స్టార్ హీరో మీద రెస్పెక్ట్. అది ఇప్పటి అభిమానులు ఏమేరకు ఇస్తున్నారు. అదేంటి అభిమానించే హీరోని దేవుడు, ప్రాణం కంటే ఎక్కువ అని భావిస్తుంటే వాళ్లకి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వమని అనుకోవచ్చు. వాళ్లకు ఇవ్వడం కాదు వారి మాటలకు ఇవ్వాలి. 


హీరోలు సినిమాలో చెప్పే మాటలు.. చేసే పనులు ఎప్పుడో ఒకప్పుడు మన రెగ్యులర్ లైఫ్ లో తారసపడుతూనే ఉంటాయి. ఆయన స్పూర్తితో ఆ పనులను విజయవంతం చేయాల్సిన బాధ్యత అభిమానుల మీద ఉంది. అంతేకాదు ఒక స్టార్ హీరో తన సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్నది అందరికి తెలిసిందే. అలా సినిమా కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడే స్టార్స్ కు స్పూర్తిగా మన జీవితంలో మనం చేసే పనులను కూడా అంతే స్పూర్తితో చేయాలి. ఇదే కదా మనం ఆ స్టార్ కు ఇచ్చే రెస్పెక్ట్.  


ఉదాహరణగా చెప్పుకుంటే గురువారం రిలీజైన మహర్షి సినిమాలో అతని లుక్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్ గా కిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్. మరి మహేష్ ఆ పాత్ర చేయడానికి ఎంత కష్టపడి ఉంటాడు. నిజంగా అతని కాలేజ్ డేస్ ని తలపించేలా.. కాదు మన కాలేజ్ డేస్ గుర్తుచేసేలా ఆ సీన్స్ ఉన్నాయి. సీన్స్ రాయడం దర్శకుడి గొప్పతనం అయినా అందులో నటించడం మాత్రం స్టార్ చేయాల్సిన పనే. వారి పనుల్లో స్టార్స్ ఎప్పుడు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. వారిని అభిమానించి వారి కోసం మన లైఫ్ లో చాలా ప్రాముఖ్యత ఇస్తున్న మనం ఏం చేస్తున్నాం.. మన పనులను ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం.. మన లైఫ్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటున్నామనేది మనకు మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. 43 ప్లస్ ఏజ్ లో కూడా మహేష్ అంత అందంగా స్మార్ట్ లుకింగ్ గా.. ఫిట్ నెస్ బాడీతో ఉన్నాడు అంటే దాని వెనుకాల అతని కష్టం ఎంతో ఒక్కసారి ఆలోచిస్తే మనం కచ్చితంగా షేంగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. 


అంటే వాళ్లకున్న వ్యాపకాలు సౌకర్యాలు వేరే.. కాని మనకు అందుబాటులో ఉన్న వాటితోనే మనం కూడా పర్ఫెక్ట్ గా ఉండటానికి ట్రై చేయొచ్చు. అభిమానులు సక్సెస్ అయితే.. అంతకంటే మించిన ఆనందం ఏముంటుంది ఏ స్టార్ హీరోకి అయినా.. సో ఫ్యాన్స్.. ఇప్పటి వరకు మనం స్టార్స్ ను అభిమానించాం ఇక నుండి వారిని స్పూర్తిగా తీసుకుని వారిని ఫాలో అవుదాం.. ఏమంటారు..!   


మరింత సమాచారం తెలుసుకోండి: