టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. సోలో రిలీజ్ కూడా మహర్షికి బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇక గత ఆరేళ్ల కాలంలో మహేష్ బాబుకు రెండు వరుస హిట్ సినిమాలు ఎప్పుడు రాలేదు. వరుస ఫ్లాపుల తర్వాత దూకుడు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ఆ వెంటనే బిజినెస్‌మేన్ సినిమాతో వరుసగా రెండో హిట్టు కొట్టాడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మూడో హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటినుంచి మహేష్‌కు హిట్ సినిమా వస్తే ఆ వెంటనే ఫ్లాప్ తగులుతోంది.1 నేనొక్కడినే, , ఆగడు సినిమాల తర్వాత శ్రీమంతుడుతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ ఆ వెంటనే బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో రెండు భారీ డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేను సినిమాతో హిట్ కొట్టిన సూపర్ స్టార్ ఇప్పుడు మహర్షి సినిమాతో వరుసగా రెండో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మహర్షికి హిట్ టాక్ రావడంతో ప్రమోషన్ కార్యక్రమాన్ని స్పీడప్ చేసిన మహేష్ వచ్చే నెల 15 నుంచి తన 26వ ప్రాజెక్టును పట్టాలు ఎక్కిస్తున్నాడు.
వరుస హిట్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కేఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ రావిపూడి నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్న ఓ హీరోయిన్గా ఎంపిక అయినట్టు తెలుస్తోంది. అలాగే మెయిన్ హీరోయిన్ కోసం ఎంపిక జరుగుతోంది. ఈ సినిమా టోటల్‌గా అనీల్ రావిపూడి స్టైల్లోనే కామెడీ & యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కెనుందట. జూన్ 15 నుంచి కంటిన్యూగా జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమాను ఫినిష్ చేయనున్నారు. అనిల్ రావిపూడి గతంలో మహేష్ నటించిన దూకుడు, ఆగడు సినిమాలకు స్క్రిప్ట్ విభాగంలో పనిచేశారు. ఇప్పుడు ఏకంగా మహేష్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.