విజయ్ దేవరకొండ నిన్న జరిగిన తన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్ళి విషయమై ఎదురైన ప్రశ్నకు వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. తన తల్లి కూడ ఇలాంటి ప్రశ్నలే తనను తరుచూ వేస్తున్న విషయాన్ని బయటపెడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

ఈమధ్య తన ఇంటిలో తన పెళ్ళి విషయమై పెరిగిపోయిన ఒత్తిడి గురించి మాట్లాడుతూ తన పెళ్ళి ఆలస్యం అయితే పిల్లలు ఎప్పుడు పుడతారు అంటూ తన తల్లి అడిగినప్పుడు తనకు వచ్చిన కోపాన్ని బయటపెట్టాడు. తనకు పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే వచ్చే నష్టం ఏమిటి అన్న విషయం పై కోపం వచ్చింది అంటూ పిల్లల కోసం పెళ్ళి చేసుకోవాలా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు విజయ్ దేవరకొండ. 

అంతేకాదు తన జీవితం తాను అనుకున్నట్లుగా ఉండాలి కానీ ఎప్పుడో పుట్టబోయే పిల్లల గురించి తానెందుకు ఆలోచనలు చేయాలి అనీ భవిష్యత్ లో తన పిల్లలు వాళ్ళు పెద్ద అయ్యాక తన గురించి ఆలోచిస్తారా అంటూ తన ఇగోను బయటపెట్టాడు ఈ క్రేజీ హీరో. తాను ప్రేమ పెళ్లి చేసుకోవాలా తల్లితండ్రులు చూసిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలా అన్న విషయమై తనకు ఇంకా క్లారిటీ లేదనీ ప్రేమ విషయంలో తన ప్రయోగాలు పూర్తి అయిన తరువాత తన తల్లితండ్రులు ఎంపిక చేసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాను అంటూ విజయ్ తన పెళ్ళి విషయమై తనకున్న ఆలోచనలను బయటపెట్టాడు. 

ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తనను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని సేవ చేయడానికి చాల పేరున్న సామాజిక సంస్థలు ప్రయత్నిస్తున్న విషయాలను వివరిస్తూ తాను ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం తనకు ఇష్టం లేదనీ తనకు చేతనైన రీతిలో సర్వీస్ చేసే ఉద్దేశాలను వివరించాడు. తనకు సేవ చేసే విషయంలో చాల కొత్త ఆలోచనలు ఉన్నాయని అయితే వాటి విషయమై తనకు క్లారిటీ వచ్చిన తరువాత మాత్రమే వివరిస్తాను అని అంటున్నాడు ఈ క్రేజీ హీరో..  


మరింత సమాచారం తెలుసుకోండి: