మన జీవితంలో కొన్ని సార్లు చేసే పొరపాటు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.  అది మంచైనా..చెడు అయినా..ఎప్పటికీ గుర్తుండి పోతుంది.  తాజాగా ఇదే విషయాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ చెబుతున్నాడు.  పెళ్లిచూపులు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ..అర్జున్ రెడ్డి, గీతాగోవిందం చిత్రాలతో ఏకంగా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు.  తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడతూ..తన లైఫ్ లో ఓ చిన్న తప్పు చేశానని..ఆ తప్ప వల్ల ఇప్పటికీ బాధపడుతున్నానని అన్నారు.


తాజాగా  హిందూస్థాన్ టైమ్స్ సంస్థ నిర్వహించిన ఇండియాస్ మోస్ట్ స్టైలిస్ట్ స్టార్ అవార్డ్స్ వేడుకలో విజయ్, హాటెస్ట్ స్టైలిష్ స్టార్ అవార్డును అందుకున్నారు. అయితే అవార్డును ప్రకటించే క్రమంలో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ ‘విజయ్ దేవరాకొండ’ అని సంబోధించారు. ఈ సందర్బంగా ఓ విలేఖరి ఇండస్ట్రీలో మిమ్మల్ని ఫ్యాన్స్ ఎన్ని పేర్లతో పిలుస్తారూ అని అడిగిన ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపోయే విధంగా సమాధానం ఇచ్చాడు. 

ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు సొంత పేరు తప్పురాసుకున్నవారిలో నేనే మొదటి వ్యక్తిననుకుంటా అన్నారు.  స్కూల్లో ‘దేవెరకొండ’అని రాశాను..అప్పటి నుంచి అది అలాగే కొనసాగుతుంది.  అయితే నేను ప్రతిచోటా నా పేరును సరిగ్గా పలకండి అని వారిని సరిదిద్దే రకాన్ని కాను. నాకు నా పేరు కరెక్ట్‌గా వినిపించినంత వరకు నాకేం సమస్య లేదు అన్నాడు విజయ్ దేవరకొండ.


మరింత సమాచారం తెలుసుకోండి: