మెగాస్టార్ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సైరా సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఇప్పుడు సందిగ్ధం నెల‌కొంది. వాస్త‌వంగా సైరాను ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని అనుకున్నారు. షూటింగ్ అనుకున్న దానికంటే బాగా లేట్ అయ్యింది. దీంతో స‌మ్మ‌ర్‌లో మ‌హ‌ర్షి సోలోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఇప్పుడు పెద్ద సినిమాల హ‌డావిడి లేదు. స్కూళ్ల రీ ఓపెనింగ్‌, వ‌ర‌ల్డ్‌క‌ప్ హ‌డావిడి ఉంది. ఇక ఇప్పుడు పెద్ద సినిమాల‌కు టార్గెట్‌గా ద‌స‌రా ఒక్క‌టే బెట‌ర్ ఆప్ష‌న్.


ఇక ఇప్పుడు వ‌చ్చే పెద్ద సినిమాల్లో అంద‌రి దృష్టి సాహో, సైరా మీదే ఉంది. సాహో ఆగ‌స్టు 15న సోలోగా రావొచ్చు. ఇక సైరా ద‌స‌రాకు రావాల్సిందే. కానీ ఇంట‌ర్న‌ల్ టాక్ ప్ర‌కారం సైరా షూటింగ్ ఎంత స్పీడ్‌గా జ‌రిగినా ద‌స‌రాకు రాక‌పోతే ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. సినిమా షూటింగ్ ఇంకా చాలా పార్ట్ ఉండ‌డంతో ద‌స‌రాకు క‌ష్ట‌మే అని కూడా యూనిట్ వ‌ర్గాలే అంటున్నాయి. 


ద‌స‌రాకు సైరా రాక‌పోతే వ‌చ్చే సంక్రాంతే క‌రెక్ట్ టైం. వ‌చ్చే సంక్రాంతికి ఇప్ప‌టికే ముగ్గురు స్టార్ హీరోలు క‌న్నేశారు. మహేష్-అనిల్ రావిపూడి, బన్నీ-త్రివిక్రమ్, మారుతి-సాయితేజ్, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ సినిమాలు అలాగే బాలయ్య - కేఎస్‌.ర‌వికుమార్ సినిమా, శ‌ర్వానంద్ సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిల్లో మ‌హేష్‌, బాల‌య్య‌, బ‌న్నీ సినిమాలు ఖ‌చ్చితంగా సంక్రాంతికే రావాల‌ని చూస్తున్నాయి. అప్పుడు ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలో సైరా రిలీజ్ కోసం మెగాస్టార్ ఉక్కిరి బిక్కిరి కాక‌త‌ప్ప‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి: