సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ ఎందుకు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలు చేస్తున్నాడు. ఆయనకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకుని ఓ మాంచి మాస్ మసాల మూవీతో కమర్షియల్ హిట్ కొట్టొచ్చు కదా అని చాలామంది డౌట్. తెలుగు సినిమాలు మారాలి కొత్త కథలు రావాలనుకునే ప్రేక్షకులు ఉన్నారు. అయితే శ్రీమంతుడు ఊరిని దత్త తీసుకునే కాన్సెప్ట్ తో వచ్చాడు మహేష్. ఆ సినిమా తర్వాత విలేజ్ అడాప్షన్ అనేది క్రేజీగా మారింది. 


ఇక ఓ సమర్ధవంతమైన నాయకుడు సిఎంగా ఉంటే ఎలా ఉంటుందో చేసి చూపించాడు భరత్. మహేష్ సిఎంగా ఎవరు ఊహించని విధంగా మళ్లీ అందులో కూడా పరిపాలన బాగుంటేనే ప్రజలు బాగుంటారని మెసేజ్ ఇచ్చాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన మహర్షి సినిమా విషయానికి వస్తే. ఓ వర్గం ప్రేక్షకులు ఇది అన్ని హిట్ సినిమాల మిక్సర్ పొట్లం అని విమర్శలు చేస్తున్నారు. అవును అది నిజమే కాని ఈ సినిమాలో అసలే కొత్త పాయింట్ లేదా అంటే చాలా ఉన్నాయి. 


మనం ప్రతి రోజు తినే టిఫిన్ నుండి భోజనం వరకు కావాల్సిన ఆహార పదార్ధాలను అందించే రైతు కష్టాల గురించి ప్రస్థావించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. రైతు సాగు చేయనిదే తిండి ఎక్కడ నుండి వస్తుంది. ఇలాంటి కథలు మహేష్ ను మాత్రమే ఎందుకు వరిస్తున్నాయో తెలియట్లేదు. నిన్న రిలీజైన మహర్షి అన్ని చోట్ల హిట్ టక్ తెచ్చుకుంది. అయితే మహర్షి సినిమాలో రిషి పాత్రలో మహేష్ కాకుంటే మిగతా స్టార్స్ లో ఆ గట్స్ ఎవరికి ఉనాయన్న చర్చ జరుగుతుంది. సినిమాలో ముఖ్యంగా వీకెండ్ ఫార్మింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 


అయితే మిగతా టాలీవుడ్ స్టార్స్ కూడా తక్కువోళ్లేం కాదు కాని ఫార్టీ ప్లస్ ఏజ్ లో కూడా ఇలా కాలేజ్ స్టూడెంట్ గా నటించి మెప్పించడం మాత్రం అది మహేష్ కు ఒక్కడికే చెల్లింది. మహేష్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చాలా సెటిల్డ్ గా ఆ స్టూడెంట్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం అద్భుతమని చెప్పొచ్చు. తన నటనతో మహేష్ మరోసారి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. మహర్షిలో రిషి పాత్రలో మరే హీరో ఆలోచించకుండా రిషిగా మహేష్ పర్ఫెక్ట్ అనిపించుకుని 3 పాత్రల్లో అదరగొట్టాడు మన సూపర్ స్టార్.   



మరింత సమాచారం తెలుసుకోండి: