Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:18 pm IST

Menu &Sections

Search

మెగాఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..అక్టోబర్ 2 న సైరా రిలీజ్..?

మెగాఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..అక్టోబర్ 2 న సైరా రిలీజ్..?
మెగాఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..అక్టోబర్ 2 న సైరా రిలీజ్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి బయోపిక్‌గా మెగాస్టార్ చిరు నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం..సైరా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావల్సి వచ్చింది. ఇంకా మిగిలిపోయిన సీన్ల షూటింగ్‌తోపాటు విఎఫ్‌ఎక్స్  గ్రాఫిక్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్  పెండింగ్‌లో ఉన్నాయి. తొలుత సైరాను ఈ ఏడాది ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నా..ఎన్నో అవాంతరాల వల్ల షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది.  మహర్షి తర్వాత  అయితే సైరా మూవీని ఈ ఏడాది దసరాకు కానీ, సంక్రాంతికి కానీ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సమ్మర్ సీజన్‌లో మహర్షి వచ్చేసింది. ఇక మిగిలినవన్నీ మీడియం, చిన్న సినిమాలే ఉన్నాయి. జూన్‌లో సిన్మాలకు పెద్ద హడావుడి ఉండదు. స్కూళ్లు స్టార్ట్ కావడం, వరల్డ్ కప్‌ ఉండడంతో ..ఇక  పెద్ద సినిమాలకు ఏకైక టార్గెట్ దసరానే. అందుకే  ఇప్పుడు అందరి దృష్టి సైరా మీద వుంది.  అయితే సైరాకు దసరా కాకపోతే, సంక్రాంతినే మిగిలింది. పొరపాటున సైరా సంక్రాంతికి వస్తాను అంటే చాలా ఇబ్బందే. ఎందుకంటే ఇప్పటి నుంచే సంక్రాంతి టార్గెట్ గా బోలెడు సినిమాలు రెడీ అవుతున్నాయి.  మహేష్ - అనిల్ రావిపూడి, బన్నీత్రివిక్రమ్, మారుతి-సాయితేజ్, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ సినిమాలు అలాగే బాలయ్య సినిమా ఒకటి, శర్వానంద్ సినిమా ఒకటి ఇలా చాలా సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతున్నాయి.

ఒక వేళ సైరా కనుక దసరాకు రాకుండా సంక్రాంతికి వస్తే అన్నీ సినిమాలకు ఇబ్బందే.. అందుకే సంక్రాంతి రాబోతున్న సిన్మాల హీరోలు, దర్శకులు, నిర్మాతలు అంతా సైరా దసరాకే రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే  మెగాస్టార్ చిరుతో అదీ..సైరా లాంటి చిత్రంతో పోటీ పడేందుకు ఎవరూ ఇష్టపడరు కూడా..దీనికి తోడు సైరా మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తారు. అప్పుడు థియేటర్లు కూడా మిగిలన సిన్మాలకు దొరకడం కష్టం. అందుకే ఎవరికీ ఇబ్బందిలేకుండా ఈ దసరాకు సైరాను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ పట్టుదలగా ఉందంట.  అక్టోబర్ 2 ను రిలీజ్  డేట్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2 బుధవారం. గురువారం నుంచి దసరా హడావుడి స్టార్ట్ అవుతుంది.

అందువల్ల వారంరోజులు వరుసగా కలిసి వస్తాయన్నది ఆలోచన చిత్ర యూనిట్‌లో ఉందంట. అందుకే వీలైనంత త్వరగా గ్రాఫికల్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాలని సైరా మూవీ యూనిట్ భావిస్తోందంట. అయితే చిత్ర నిర్మాత రాంచరణ్ మాత్రం క్వాలీటీలో ఏ మాత్రం రాజీపడడానికి ఇష్టపడడం లేదంట. అందుకే బడ్జెట్ ఎంత అయినా ఇప్పటికే అనేక సార్లు రీషూట్స్ చేయించాడు. అలాగే విఎఫ్ఎక్స్ సీజీ వర్క్స్ క్వాలిటీగా రావాలంటే చాలా సమయం పడుతుంది.

ఈ నాలుగు నెలల్లో అన్నీ పనులు పూర్తి చేసి సైరాను అక్టోబర్‌ 2 న రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.  ఆగస్టులో సాహో, అక్టోబర్‌లో సైరా రిలీజైతే, వచ్చే సంక్రాంతి సిన్మాలు ఊపిరి పీల్చుకుంటాయి. ఒక వేళ సైరా అనుకున్నట్లుగా అక్టోబర్ 2 న రిలీజ్ కాకపోతే ఏకైక ఆప్షన్ సంక్రాంతి సీజనే. దీంతో మళ్లీ సంక్రాంతి సినిమాల పరిస్థితి గందరగోళంగా మారుతుంది. మరి సైరా మూవీతో మెగాస్టార్ చిరు ఈ దసరాకు వచ్చి బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తాడో లేదో చూడాలి. అనుకున్నట్లుగా సైరా ఈ దసరాకు వచ్చేస్తే మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు.


sye-raa-narasimha-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Im interested in writing articles.