ఓ హీరోయిన్ పై ఓ ఛానల్ అడ్డగోలుగా వార్త రాసి ప్రసారం చేసింది. ఇలాంటి వార్తలు మీడియాలో చాలా వస్తుంటాయి. వీటిని సెలబ్రెటిలు గాసిప్స్ కదా అని వదిలేస్తుంటారు. మరికొందరు మాత్రం పట్టుపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటారు.


కన్నడ హీరోయిన్‌, మాజీ ఎంపీ రమ్య విషయంలో ఇలాగే జరిగింది. 2013లో నటి రమ్య సువర్ణ 24-7 చానల్ పై పరువు నష్టం దావా వేసింది. ఆమె క్రికెట్ బెట్టింగ్ పాల్పడ్డారంటూ ఆమె పోటోతో సహా ఆ చానల్ ప్రసారం చేయడమే ఇందుకు కారణం. చట్టపరమైన చర్యల కోసం ఆమె కోర్టుకు ఎక్కారు. 

రమ్య గతంలో ఐపిఎల్ లో బెంగూళూరు రాయల్ చాలెజర్ బ్రాడ్ అంబాసిడర్ గా ఉండేవారు. ఈ వార్తలు ప్రసారం చేసిన 2013 లో ఆమె ఆ బాద్యత ల నుంచి తప్పుకున్నారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ సువర్ణ ఛానల్ పై  కోర్టుకు వెళ్లారు. 

కేసును విచారించిన స్థానిక కోర్టు ఆమెకు ఏభై లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు కాను సువర్ణ ఛానల్ ఇప్పుడు ఆమెకు అరకోటి రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ఇలాంటి గాసిప్ వార్తలను సెలబ్రెటీలు కూడా లైట్ గా తీసుకుంటారు. కానీ రమ్య మాత్రం పట్టుదలతో ఆ ఛానల్‌పై పోరాడి గెలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: