ఎప్పుడు వచ్చాం కాదు అన్నయ్యా..బుల్లెట్ దిగిందా లేదా.. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు బ్లాకౌతుందో వాడే పండుగాడు..‘పోకిరి’మూవీలో మహేష్ కొట్టే పంచ్ డైలాగ్స్ కి అప్పట్లో ఫ్యాన్స్ పూనకం వచ్చినవాళ్లలా ఊగిపోయారు.  మహేష్ సినిమాలు హిట్, ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు మాత్రం రాబట్టగలవని టాక్ ఉంది. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  ఈ మద్య టాలీవుడ్ సినిమాలు ఆ రేంజ్ కి చేరుకోవడం చాలా రేర్ అనే చెప్పొచ్చు.  


నిన్న వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  అయితే ఈ సినిమా చూసిన కొందరు మాత్రం రొటీన్ స్టోరికి రైతు సెంటిమెంట్ పూత పూశారని నెగిటీవ్ టాక్ కూడా వినిపించింది.  ఏది ఏమైనా మొదటి రోజు ఈ సినిమా దుమ్మురేపే కలెక్షన్లు రాబట్టింది.  ఈ సినిమా మూడు ఏరియాల్లో తొలి రోజు వ‌సూళ్ల‌లో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రాస్ చేసింది.  


నైజాంలో అయితే బాహుబ‌లి 1 రికార్డుల‌ను సైతం దాటేసి ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇచ్చింది. మ‌హ‌ర్షి తొలి రోజు నైజాం ,గుంటూరు , కృష్ణా లో మంచి కలెక్షన్లు రాబడుతుంది. మొదటిరోజు ఈ సినిమా నైజాంలో రూ.6.38 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  బాహుబలి 2 తరువాత ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది మహర్షి.  బాహుబలి 2 రూ.8.95 కోట్లు వసూలు చేయగా, బాహుబలి 1 రూ.6.26 కోట్లు వసూలు చేసింది.  అంతే కాదు ఈ సినిమా చెన్నైలో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు రాబడుతున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: