Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 3:56 am IST

Menu &Sections

Search

బలుపు సినిమా డైరెక్టర్ తో మరో సినిమా చేయబోతున్న రవితేజ

బలుపు సినిమా డైరెక్టర్ తో మరో సినిమా చేయబోతున్న రవితేజ
బలుపు సినిమా డైరెక్టర్ తో మరో సినిమా చేయబోతున్న రవితేజ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మాస్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ రవితేజ, తన నటనలో ఒక రకమైన ఈజ్ తో గ్రేసు తో ప్రేక్షకులను అలరిస్తారు రవితేజ. అయితే రవితేజ ప్రస్తుతానికి వి.ఐ. ఆనంద్ దర్సకత్వం లో “డిస్కో రాజా” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తీ కాగా రెండో షెడ్యూల్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు రవితేజ. వచ్చే వారం నుండి మల్లి షూటింగ్ ప్రారంభం కానుంది.


ఈ చిత్రం ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది, రవితేజ ఈ చిత్రం లో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. పాయల్ రాజ్ పుట్, నభా నటేష్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. పాయల్ రాజ్ పుట్ RX100 సినిమా తో మంచి పేరు సంపాదించుకుంది. ఈ భామ హీరోయిన్ పాత్రలే కాకుండా దీపం ఉన్నప్పుడే ఇళ్ళు చేక్కబెట్టుకోవాలి అన్నట్లు ఐటమ్ సాంగ్ లకు కూడా ఒకే చెప్తుంది అని వినికిడి.

Ravi Teja is going to do another film with director of the film

డిస్కో రాజా ఒక కొత్త కధనం తో తెరకెక్కిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం లో ప్రముఖ కోలీవుడ్ హీరో బాబీ సింహ విలన్ గా కనిపించనున్నారు. సునీల్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు.


ఇదిలా ఉండగా రవితేజ తరువాతి సినిమా “బలుపు” సినిమా డైరెక్టర్, గోపీచంద్ మలినేని తో చేయబోతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “డాన్ శీను”, బలుపు చిత్రాలు పెద్ద విజయాలను సాదించాయి. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా హిట్ అయ్తేయ్ ఇద్దరికి హట్రిక్ వచ్చినట్లే.


Ravi Teja is going to do another film with director of the film
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.