స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్నాడు. సరైనోడు సినిమాతో కొత్త మ్యానరిజం తో అలరిస్తున్న బన్నీ నా పేరు సూర్యతో పెద్ద హిట్ ను కైవసం చేసుకున్నాడు. సినిమాల ఎంపిక లో బన్ని చాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఏప్పటికప్పుడు కొత్త పాత్రలకు ఒకే చెప్తున్నారు. బన్ని నటన, డాన్స్ అతనికి పెద్ద ప్లస్ పాయింట్స్.


ప్రస్తుతానికి బన్ని త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం చిత్రికరణ దశలో ఉంది . బన్ని త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులయీ’, సన్ అఫ్ సత్యమూర్తి’ వచ్చాయి తరువాత మూడవ సినిమా ఇదే. అల్లు అర్జున్ 19వ సినిమా ఇది. ఈ కాంబినేషన్ లో ఈసారి కూడా బన్ని హిట్ కొట్టినట్టైతే త్రివిక్రమ్ బన్ని కాంబినేషన్ లో హ్యాట్రిక్ వచ్చినట్లే.

Image result for allu arjun images

తాజాగా ఈ చిత్రం తొలి దశ షూటింగ్ పూర్తీ చేసుకుంది తరువాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ గ్యాప్ లో బన్ని చిన్న సమ్మర్ బ్రేక్ తీసుకున్నాడంట. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, గీత ఆర్ట్స్ బ్యానేర్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణం లో తెరకేక్కబోతుంది.


ఇదిలా ఉండగా, బన్నికి సుకుమార్ ఒక కొత్త కదా వినిపించినట్లు అది నచ్చి బన్ని దాన్ని ఒకే చేసినట్లు సమాచారం. కాబట్టి బన్ని , త్రివిక్రమ్ మూవీ సెట్స్ పై ఉండగానే సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ను రేపే ఓపెనింగ్ చేయాలనీ నిర్ణయం చేసారంట. ఈ సినిమా 11వ మే ఓపెనింగ్ చేసి స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ పనిలో ఉన్నాడట సుకుమార్. ఈ చిత్రం లో రాష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని వినికిడి.


మరింత సమాచారం తెలుసుకోండి: