Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 5:10 pm IST

Menu &Sections

Search

దేవీశ్రీకి బ్యాడ్ టైమ్..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడా...!

దేవీశ్రీకి బ్యాడ్ టైమ్..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడా...!
దేవీశ్రీకి బ్యాడ్ టైమ్..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కు ఇండస్ట్రీలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా..దేవీ మునపటిలా తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడా...ఒకప్పడు తన ఎనర్జిటిక్ మ్యూజిక్ పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్లు సైతం కాలుకదిపేలా చేసిన దేవి ఇప్పుడు కనీసం బ్యాక్‌‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో విఫలమవుతున్నాడా అంటే..మహర్షి సిన్మా చూశాక నిజమే అనిపిస్తుంది. 


రంగస్థలం మూవీ నాన్ బాహుబలి కేటగిరిలో నంబర్‌వన్‌గా నిలిచిందంటే దీనికి ప్రధాన కారణం...దేవిశ్రీ అందించిన మ్యూజిక్, మెస్మరైజింగ్ సాంగ్స్, అద్భుతమైన ఆర్ఆర్ అని చెప్పకతప్పదు. దేవిశ్రీ ప్రసాద్ రంగస్థలం సిన్మాకు తన సంగీతంతో ప్రాణం పోశాడు. కానీ రంగస్థలం తర్వాత దేవి ఆ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడు.  రంగస్థలం తర్వాత వినయవిధేయ రామ చిత్రానికి  మళ్లీ దేవిశ్రీప్రసాద్‌నే ఎంచుకున్నాడు రామ్‌చరణ్. కానీ వినయవిధేయ రామ చిత్రానికి దేవిశ్రీ పేలవమైన మ్యూజిక్ ఇచ్చాడు. వినయ విధేయ రామ పాటలు వింటే అసలు ఇవి దేవిశ్రీ ప్రసాద్ పాటలేనా అని ఆడియన్స్‌‌కు అనుమానం వచ్చింది. ఏ మాత్రం ఆకట్టుకోలేని సంగీతం ఇచ్చిన దేవి శ్రీ పట్ల మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. వినయ విధేయ రామ దెబ్బతో చెర్రీ ఇప్పట్లో దేవిశ్రీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోవచ్చు. 


ఇక మహేష్ వంతు. తనకు శ్రీమంతుడు, భరత్ అనే నేను బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్లు ఇచ్చిన దేవిశ్రీకే మహర్షి మూవీకి ఛాన్స్ ఇచ్చాడు...మహేష్. అయితే మహర్షి ఆడియో ఒక్కో పాట విడుదల అవుతున్నకొద్ది మహేష్ ఫ్యాన్స్ ఘోరంగా డిసప్పాయింట్ అయ్యారు. ఒక్క పదరా పదరా, మాంటేజ్ సాంగ్స్ తప్ప మిగతా ఏ పాటలు ఆకట్టుకోవడంపై మహేష్ ఫ్యాన్స్ పెదవి విరిచారు. కనీసం శ్రీమంతుడు, భరత్ అనే నేను రేంజ్‌లో మహర్షి మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా దేవిశ్రీ ఇవ్వలేకపోయాడు. దీంతో ఇదేం మ్యూజిక్ అని మహేష్ ఫ్యాన్స్ దేవిశ్రీపై మండిపడుతున్నాడు. ఇదిలా ఉంటే అత్తారింటికి దారేది సిన్మా తర్వాత తనకు అత్యంత ఆప్త మిత్రుడు, స్టార్ డైరెక్టర్ తివిక్రమ్‌తో కూడా దేవిశ్రీకి విబేధాలు వచ్చాయి.

దీంతో తివిక్రమ్ "అఆ " సిన్మాకు అనిరుధ్‌కు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్  "అరవింద సమేతకు" తమన్‌కు అవకాశం ఇచ్చాడు. తాజాగా అల్లు అర్జున్‌తో చిత్రానికి కూడా తివిక్రమ్ తమన్‌కే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తివిక్రమ్ కూడా దేవిశ్రీకి ఇప్పట్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు.  అయితే ఇటీవల F2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న మహేష్ 26 వ సిన్మాకు మళ్లీ దేవిశ్రీనే మ్యూజిక్ చేస్తున్నట్లు వార్తలు వస్తుండడం మహేష్ ఫ్యాన్స్‌ని కలవరపడుతుంది. ఫాంలో లేని దేవిశ్రీ మళ్లీ ఈ మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అని మహేష్ ఫ్యాన్ భయపడుతున్నారు. మరి దేవిశ్రీ బౌన్స్ బ్యాక్ అయి, మళ్లీ తన మ్యూజిక్‌తో అద్భుతమైన బ్లాక్‌బస్టర్ సిన్మాలు ఇవ్వాలని కోరుకుందాం.


devi-sri-prasad
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Im interested in writing articles.