మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా తొలి రోజు మిక్స్‌డ్ టాక్‌తోసూ వ‌సూళ్ల వీరంగం ఆడేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మ‌హ‌ర్షి రూ. 33.35 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు 24.25 కోట్ల షేర్ రాబ‌ట్టింది. మ‌హేష్‌కు ఈ వ‌సూళ్లు కెరీర్ బెస్ట్‌గా నిలిచాయి. మహేష్ కెరీర్‌లో టాప్ వ‌సూళ్లు రాబ‌ట్టిన శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను సినిమాలు సైతం ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయాయి.


ఇక నైజాం, కృష్ణా, గుంటూరు లాంటి చోట్ల ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లో బాహుబ‌లి రికార్డులు సైతం మ‌హ‌ర్షి బీట్ చేసేసింది. నైజాంలో అయితే బాహుబ‌లి 1 రికార్డులు కూడా దాటేసి రెండో ప్లేస్‌లో ఉంది. చెన్నై లో మొదటి రోజు 23లక్షల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో అక్కడ వసూళ్లు రావడం గొప్ప విషయమే. స్పైడ‌ర్ సినిమా త‌ర్వాత మ‌హేష్‌కు అక్క‌డ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.


మ‌హ‌ర్షి ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో) :
నైజాం - 6.38
సీడెడ్ - 2.45
గుంటూరు - 4.40
కృష్ణా - 1.40
ఈస్ట్ - 3.20
వెస్ట్ - 2.46
వైజాగ్ ఏరియా - 2.89
నెల్లూరు - 1.01
------------------------------------------------ 
ఏపీ + తెలంగాణ ఫ‌స్ట్ డే = 24. 25 కోట్లు
-------------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: