‘మహర్షి’ టాక్ బయటకు వచ్చిన తరువాత ముంబాయి నుండి కరణ్ జోహార్ మహేష్ కు ఫోన్ చేసి ఒక బ్యాడ్ న్యూస్ అంటూ నిన్న భయపెట్టాడట. దానితో మహేష్ గొంతులో  ఖంగారు కనిపించడంతో కరణ్ జోహార్ నవ్వుతూ ‘మీకేరియర్ లో మహర్షి లాంటి సినిమా రావడం చాల కష్టం. అందుకే అది మీకు బ్యాడ్ న్యూస్’ అని కరణ్ జోహార్ అనడంతో ఒక్క క్షణం పాటు టెన్షన్ లోకి వెళ్ళిపోయిన మహేష్ ఆతరువాత తేరుకున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే ‘మహర్షి’ విడుదలై ఒక్కరోజు పూర్తి అయిపోవడంతో అభిమానుల పాజిటివ్ టాక్ మధ్యన విమర్శకులు ఈమూవీ పై చేస్తున్న విమర్శలు కూడ బయట పడుతున్నాయి. ‘మహర్షి’ మూవీ చాల ఉదాత్తంగా కనిపించినా మహేష్ నటించిన గత సినిమాలు ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ సినిమాలను గుర్తుకు చేసి మహేష్ పాత్ర డిజైనింగ్ పాత పద్ధతిలోనే కొనసాగింది అన్నకామెంట్స్ వస్తున్నాయి.

వాస్తవానికి ‘మహర్షి’ ఏ స్థాయికి చేరుకుంటుంది అన్న విషయాలను పక్కకు పెడితే గత కొన్ని సంవత్సరాలుగా మహేష్ ను దర్శకులు ఏవిధంగా చూపెడుతున్నారో అదేవిధంగా వంశీ పైడిపల్లి ‘మహర్షి’ లో మహేష్ ను చూపించాడు కానీ మహేష్ నటనలోని కొత్త కోణాన్నీ చూపించలేకపోయాడు అన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు మహేష్ ను కొత్త కోణంలో చూపెట్టడానికి టాప్ దర్శకులు కూడ భయపడుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

దీనికితోడు మహేష్ బాబు ఏ సినిమా చేసినా ఆమూవీలోని హీరో క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల్లో అంత బలంగా నాటుకుపోతున్న  నేపధ్యంలో మహేష్ తో ప్రయోగాలు చేయడానికిచేయి తిరిగిన దర్శకులు కూడ భయపడుతున్నారు. ఈ పరిస్థుతులలో లేటెస్ట్ గా మహేష్ తో సినిమాను మొదలుపెట్టబోతున్న అనీల్ రావిపూడి అయినా కొత్త కోణంలో మహేష్ పాత్రను చూపెడతాడా లేదంటే ఆమూవీ కూడ మహేష్ నటించిన పాత సినిమాలను గుర్తుకు చేసే విధంగా తయారు అవుతుందా అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ పై మహేష్ దర్శకులు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: