పీక్ సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసుకుంటూ ‘మహర్షి’ విడుదలైంది. ఈమూవీకి మరే మూవీ పోటీ లేకపోవడంతో పాటు టికెట్ ధరల పెంపు అదనపు షోలు ఇలా అనేక అవకశాలు కలిసి వచ్చినా ‘మహర్షి’ ఫస్ట్ డే కలక్షన్స్ అందరూ ఆశించినట్లుగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో టాప్ 3 లో చేరలేకపోవడం షాక్ ఇచ్చే అంశంగా మారింది. 

ప్రస్తుతం జనం అంతా ఖాళీగా ఉన్న నేపధ్యంలో ఎంటర్ టైన్మెంట్ కోసం థియేటర్ వెళ్లడమే ప్రధానమైన విషయంగా పరిగణిస్తున్నారు. మన ఇరు రాష్ట్రాలలోని అన్ని ఊళ్లల్లో స్క్రీన్లన్ని ‘మహర్షి’ తోనే నిండిపోయాయి. దీనితో మహేష్ ‘మహర్షి’ రికార్డులు బద్ధలుకోట్టాలి. కానీ అది జరగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  

తెలుస్తున్న సమాచారం మేరకు ‘మహర్షి’ కి మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల 18 లక్షల దాకా షేర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కలక్షన్స్ ను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటిదాకా వచ్చిన టాప్ టాలీవుడ్ సినిమాల ఓపెనింగ్స్ రికార్డ్స్ లో ‘మహర్షి’ 5వ స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ‘బాహుబలి 2’ మొదటిరోజు 42 కోట్ల 86 లక్షలతో టాప్ ప్లేస్ లో ఉంటే  ఆ తర్వాత స్థానంలో 26 కోట్ల 60 లక్షలతో ‘అరవింద సమేత వీర రాఘవ’ ఉంది. మూడో ప్లేస్ ‘అజ్ఞాతవాసి’ 26 కోట్ల 30 లక్షలతో ఉండగా నాలుగో స్థానాన్ని 26 కోట్ల 3 లక్షలతో ‘వినయ విధేయ రామ’ తీసుకుంది. 

విచిత్రంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘అజ్ఞాతవాసి’ ‘వినయ విధేయ రామ’ ల కంటే చాల పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని కూడ ‘మహర్షి’ అంచనాలను చేరుకోలేకపోవడం అత్యంత షాకింగ్ గా మారింది. దీనితో ఈమూవీ ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేయడం సందేహమే అని అంటున్నారు.  టాక్ పరంగా అన్ని విధాల పరిస్థుతులు ‘మహర్షి’ కి అనుకూలంగా ఉన్నా ఈమూవీ  కంటెంట్ లో రిపీట్ ఆడియన్స్ తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు మళ్ళీమళ్ళీ ‘మహర్షి’  ధియేటర్లకు రారనీ ఈ వీకెండ్ తర్వాత ఈమూవీ స్లో అయ్యే ఆస్కారం ఉంది అని వస్తున్న వార్తలు ఈమూవీ బయ్యర్లను భయపడుతున్నట్లువార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: