నిన్న విడుదలైన మహర్షికి వచ్చిన డివైడ్ టాక్ ప‌క్క‌న పెడితే వ‌సూళ్ల ప‌రంగా ఓకే సినిమాగా నిలుస్తోంది. ఈ సినిమా స్టార్టింగ్‌లో యాంక‌ర్ ఝాన్సీ సీఈవోగా ఉన్న మ‌హేష్‌ను ఇంట‌ర్వ్యూ చేస్తుంది. ఈ ఇంట‌ర్వ్యూలో యేడాదికి రూ.900 కోట్లు శాల‌రీ తీసుకునే మీరు ఎలా ఫీల‌వుతున్నారు ? అన్న ప్ర‌శ్న వేస్తుంది. ఇందుకు రిషీ రోల్ బ‌దులివ్వ‌డంలోనే అత‌డి వ్య‌క్తిత్వాన్ని ద‌ర్శ‌కుడు రివీల్ చేస్తాడు. 


ఇక ఈ సినిమా చూసిన వారు ఈ సీఈవో రిషీ రోల్‌కు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ స్ఫూర్తి అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు. ఓ భారతీయుడు సీఈవోగా ఉన్నా అన్ని కోట్ల శాల‌రీ ఉంటుందా ? అన్న సందేహాలు స‌హ‌జంగానే ఉంటాయ్‌. మ‌రి సుంద‌ర్ పిచాయ్‌కు యేడాది శాల‌రీ రూ.1200 కోట్లు. గూగుల్ కూడా ఇదే ఫిగ‌ర్ చూపిస్తోంది. ఇప్పుడు రిషీ రోల్‌కు కూడా అంతే వాడేస్తే కాపీ అనుకుంటారు అనుకున్నారో ?  ఏమో గాని ఓ 300 కోట్లు త‌గ్గించి రూ. 900 కోట్లుగా చూపించారు.


ఇక ఎవ‌రికి అయినా కంపెనీలు ఆఫ‌ర్ ఇస్తాయి. ఈ సినిమాలో కంపెనీకే రిషీ ఆఫ‌ర్ ఇస్తాడు. ఇది కాస్త అతియోశ‌క్తిగా ఉన్నా మాస్ మూమెంట్స్ కోసం ఇలాంటివి మ‌న తెలుగు సినిమాల్లో కామ‌నే. ఇక మిక్స్‌డ్ టాక్‌తో మ‌హ‌ర్షి తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.24.25 కోట్ల షేర్ రాబ‌ట్టింది. సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే వ‌సూళ్లు త‌క్కేవే అన్న భావ‌న ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. వీకెండ్ వ‌ర‌కు వ‌సూళ్ల‌కు డోకా లేక‌పోయినా మహర్షికి అసలు పరీక్ష సోమవారం నుంచి మొదలు కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: