కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్థాయి హీరో గా పేరు తెచ్చుకున్నాడు అజిత్ కుమార్. తమిళ అభిమానులు తల అజిత్ అని పిలుస్తారు. ఆయన కొత్త సినిమా వస్తోందంటే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ఇక అజిత్ సినిమా రిలీజ్ అవుతుందన్న కొద్దిరోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద నానా హడావుడి చేస్తుంటారు..కటౌట్ల ఏర్పాట్లు..సంబరాలు జరుపుకుంటారు.
కోలీవుడ్ లోనే కాదు..టాలీవుడ్ లో సైతం అజిత్ సినిమాలు హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా కలెక్షన్లు మాత్రం భారీగానే వసూళ్లు చేస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన అజిత్ చివరి మూవీ విశ్వాసం కూడా అదే శైలిలో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఇక మే 1 అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ సన్ టీవీలో ప్రీమియర్ షో వేస్తే రికార్డ్ లు షేక్ అయ్యాయి.
మే 1న అజిత్ పుట్టిన రోజు సందర్బంగా టెలీకాస్ట్ చేసిన ఈ మూవీ 1,81,43,000 ఇంప్రెషన్స్ తో ఇప్పటివరకూ ఏ సౌతిండయన్ సినిమా క్రియోట్ చేయని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు రాబట్టిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలోను విడుదల చేశారు. కాగా, అప్పటిదాకా విజయ్ ఆంటోని బిచ్చగాడు, ప్రభాస్ బాహుబలి చిత్రాలే టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసం సినిమా దాన్ని బ్రద్దలు కొట్టింది. విశ్వాసం చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.